ఖేల్ రత్న రేసులో పళ్లికల్

13 May, 2015 01:04 IST|Sakshi

న్యూఢిల్లీ : భారత క్రీడా రంగంలో అత్యున్నత పురస్కారం రాజీవ్ గాంధీ ఖేల్ రత్న కోసం స్టార్ స్క్వాష్ క్రీడాకారిణి దీపికా పళ్లికల్ పేరును తమిళనాడు ప్రభుత్వం కేంద్రానికి ప్రతిపాదించింది. టాప్-10 ప్రపంచ ర్యాంకింగ్స్‌లో చోటు దక్కించుకున్న తొలి స్క్వాష్ ప్లేయర్‌గా 23 ఏళ్ల దీపికా రికార్డులకెక్కింది.  2014 కామన్వెల్త్ గేమ్స్‌లో జోష్నా చిన్నప్పతో కలిసి దేశ స్క్వాష్ చరిత్రలో తొలిసారి దీపికా స్వర్ణం సాధించింది. తమిళనాడు క్రీడా అభివృద్ధి అథారిటీ దీపిక పేరును కేంద్రానికి ప్రతిపాదించినప్పుడు తన ర్యాంకు 11 ఉండగా ప్రస్తుతం 18వ స్థానంలో కొనసాగుతోంది.

మరిన్ని వార్తలు