ఢిల్లీ చేతిలో హైదరాబాద్‌ ఓటమి

22 Sep, 2018 09:57 IST|Sakshi

అర్ధసెంచరీతో రాణించిన సందీప్‌

విజయ్‌ హజారే వన్డే టోర్నీ  

సాక్షి, హైదరాబాద్‌: బ్యాట్స్‌మెన్‌ నిర్లక్ష్యానికి తోడు వాతావరణం అనుకూలించకపోవడంతో విజయ్‌ హజారే వన్డే టోర్నీలో హైదరాబాద్‌ జట్టుకు తొలి పరాజయం ఎదురైంది. న్యూఢిల్లీలోని ఫిరోజ్‌షా కోట్లా మైదానంలో శుక్రవారం జరిగిన గ్రూప్‌ ‘బి’ మ్యాచ్‌లో ఆతిథ్య ఢిల్లీ జట్టు హైదరాబాద్‌పై ఘనవిజయం సాధించింది. మ్యాచ్‌కు వర్షం అంతరాయం కలిగించడంతో ఢిల్లీ ‘వీజేడీ’ పద్ధతిలో 6 వికెట్ల తేడాతో గెలుపొందింది. టాస్‌ గెలిచి తొలుత బ్యాటింగ్‌ చేసిన హైదరాబాద్‌ను ఢిల్లీ బౌలర్‌ మనన్‌ శర్మ (4/42) కట్టడి చేశాడు. దీంతో హైదరాబాద్‌ 47.4 ఓవర్లలో 205 పరుగుల సాధారణ స్కోరుకు ఆలౌటైంది. మధ్యప్రదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో చెలరేగిన తన్మయ్‌ అగర్వాల్‌ (14), కె. రోహిత్‌ రాయుడు (22) ఈ మ్యాచ్‌లో విఫలమయ్యారు.

కెప్టెన్‌ అక్షత్‌రెడ్డి (15), వికెట్‌ కీపర్‌ సుమంత్‌ కొల్లా (30) కూడా తక్కువ స్కోరుకే వెనుదిరగగా... బావనాక సందీప్‌ (67 బంతుల్లో 51; 5 ఫోర్లు) అర్ధసెంచరీతో ఇన్నింగ్స్‌ను నడిపించాడు. చివర్లో సిరాజ్‌ (24 బంతుల్లో 36 నాటౌట్‌; 3 ఫోర్లు, 2 సిక్సర్లు) దూకుడుగా ఆడటంతో జట్టు ఓ మోస్తరు స్కోరు చేయగలిగింది. అనంతరం వర్షం కారణంగా మ్యాచ్‌కు అంతరాయం కలగడంతో ఢిల్లీ లక్ష్యాన్ని 39 ఓవర్లలో 176 పరుగులుగా సవరించాడు. ఈ లక్ష్యాన్ని ఢిల్లీ 30.4 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి ఛేదించింది. కెప్టెన్‌ గౌతమ్‌ గంభీర్‌ (47 బంతుల్లో 41; 6 ఫోర్లు), నితీష్‌ రాణా (87 బంతుల్లో 91 నాటౌట్‌; 12 ఫోర్లు, 2 సిక్సర్లు) చెలరేగడంతో ఢిల్లీ 178 పరుగులు చేసి గెలుపొందింది. రిషభ్‌ పంత్‌ (17; 3 ఫోర్లు) పరవాలేదనిపించాడు. హైదరాబాద్‌ బౌలర్లలో రవికిరణ్‌ 2 వికెట్లు పడగొట్టగా... మెహదీ హసన్, రోహిత్‌ రాయుడు చెరో వికెట్‌ దక్కించుకున్నారు. ఆదివారం జరిగే తమ తదుపరి మ్యాచ్‌లో సౌరాష్ట్రతో హైదరాబాద్‌ తలపడుతుంది.
 
స్కోరు వివరాలు

హైదరాబాద్‌ ఇన్నింగ్స్‌: తన్మయ్‌ (సి) లలిత్‌ (బి) నవదీప్‌ సైనీ 14; అక్షత్‌ రెడ్డి (సి) సుబోధ్‌ (బి) సిమర్జీత్‌ సింగ్‌ 15; రోహిత్‌ రాయుడు (సి) రిషభ్‌ పంత్‌ (బి) నితీశ్‌ రాణా 22; సుమంత్‌ (సి) మనన్‌ 30; సందీప్‌ (సి) నితీశ్‌ రాణా (బి) లలిత్‌ 51; ఆశిష్‌ రెడ్డి (సి) గంభీర్‌ (బి) మనన్‌ 2; ఆకాశ్‌ భండారి ఎల్బీ (బి) మనన్‌ 6; మెహదీహసన్‌ (సి) మనన్‌ (బి) నవదీప్‌ సైనీ 10; మిలింద్‌ (బి) మనన్‌ 13; సిరాజ్‌ నాటౌట్‌ 36; రవికిరణ్‌ (బి) సుబోధ్‌ 2; ఎక్స్‌ట్రాలు 4; మొత్తం (47.4 ఓవర్లలో ఆలౌట్‌) 205.

వికెట్ల పతనం: 1–25, 2–39, 3–79, 4–94, 5–100, 6–114, 7–154, 8–155, 9–186, 10–205.
బౌలింగ్‌: నవదీప్‌ సైనీ 10–0–45–2, సిమర్జీత్‌ సింగ్‌ 7–2–21–1, సుబోధ్‌ భటి 8.4–0–40–1, నితీశ్‌ రాణా 6–0–30–1, మనన్‌ 9–0–42–4, లలిత్‌ యాదవ్‌7–0–27–1.  

ఢిల్లీ ఇన్నింగ్స్‌: ఉన్ముక్త్‌ చంద్‌ (బి) రవికిరణ్‌ 0; గంభీర్‌ ఎల్బీ (బి) మెహదీ హసన్‌ 41; ధ్రువ్‌ షోరే (సి) రోహిత్‌ రాయుడు (బి) రవికిరణ్‌ 9; నితీశ్‌ రాణా నాటౌట్‌ 91; రిషభ్‌ పంత్‌ (సి) సుమంత్‌ (బి) రోహిత్‌ రాయుడు 17; హిమ్మత్‌ సింగ్‌ నాటౌట్‌ 14; ఎక్స్‌ట్రాలు 6; మొత్తం (30.4 ఓవర్లలో 4 వికెట్లకు) 178.
వికెట్ల పతనం: 1–0, 2–23, 3–97, 4–140.

బౌలింగ్‌: రవికిరణ్‌ 5–1–24–2, సిరాజ్‌ 5–0–32–0, మిలింద్‌ 4–0–26–0, మెహదీహసన్‌ 7.4–0–42–1, రోహిత్‌ రాయుడు 3–0–17–1, ఆశిష్‌ రెడ్డి 2–0–19–0, ఆకాశ్‌ భండారి 4–0–17–0.  

మరిన్ని వార్తలు