కుప్పకూలిన ఢిల్లీ టాపార్డర్

9 May, 2015 22:55 IST|Sakshi
కుప్పకూలిన ఢిల్లీ టాపార్డర్

రాయపూర్: ఐపీఎల్-8లో భాగంగా సన్ రైజర్స్ హైదరాబాద్ నిర్దేశించిన 164 పరుగలు టార్గెట్ ఛేదించడానికి బ్యాటింగ్ కు దిగిన ఢిల్లీ డేర్ డెవిల్స్ 13 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఢిల్లీ జట్టు 66 పరుగులకే టాపార్డర్ బ్యాట్స్ మన్ వికెట్లు కోల్పోయింది. ఓపెనర్ శ్రేయాస్ అయ్యర్ డకౌట్ కాగా, యువరాజ్ సింగ్ (2), కెప్టెన్ జేపీ డుమిని (12) నిరాశపరిచారు. ఢిల్లీ మరో ఓపెనర్ క్వింటన్ డికాక్ (31 బంతుల్లో 50: 9 ఫోర్లు, 1 సిక్స్) మాత్రమే రాణించాడు. లేకుంటే డేర్ డెవిల్స్ పరిస్థితి మరింత అధ్వాన్నంగా ఉండేది.

సన్ రైజర్స్ హైదరాబాద్ బౌలర్లలో కరణ్ శర్మ 2 వికెట్లు పడగొట్టాడు. పర్వేజ్ రసూల్, భువనేశ్వర్ కుమార్ చెరో వికెట్ తీశారు.  13 ఓవర్లలో ఢిల్లీ స్కోరు 82/4  గా ఉంది.  ప్రస్తుతం కేదార్ జాదవ్(5) , సౌరబ్ తివారీ (12) క్రీజులో ఉన్నారు.

మరిన్ని వార్తలు