ఆర్సీబీ రేసులో నిలిచేనా?

28 Apr, 2019 15:48 IST|Sakshi

ఢిల్లీ: ఐపీఎల్‌లో భాగంగా ఇక్కడ స్థానిక ఫిరోజ్‌ షా కోట్ల మైదానంలో ఢిల్లీ క్యాపిటల్స్‌తో రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు తలపడుతోంది.  ఈ మ్యాచ్‌లో టాస్‌ గెలిచిన ఢిల్లీ క్యాపిటల్స్‌ మొదట బ్యాటింగ్‌ తీసుకుంది. ఇప్పటివరకూ ఢిల్లీ 11 మ్యాచ్‌లు ఆడి ఏడు మ్యాచ్‌ల్లో గెలుపొందగా, బెంగళూరు 11 మ్యాచ్‌లకు గాను నాలుగు మ్యాచ్‌ల్లో మాత్రమే విజయం సాధించింది. అయితే కోహ్లి నేతృత్వంలోని బెంగళూరు హ్యాట్రిక్‌ విజయాలు సాధించి ప్లేఆఫ్‌ ఆశలు సజీవంగా ఉంచుకుంది.

ఈ క్రమంలోనే నేటి మ్యాచ్‌ కూడా బెంగళూరుకు ఎంతో కీలకం. ఈ మ్యాచ్‌లో గెలిస్తేనే బెంగళూరు రేసులో ఉంటుంది. లేని పక్షంలో ఇంటి ముఖం  పట్టక తప్పదు. మరొకవైపు ఢిల్లీ అంచనాలు మించి రాణిస్తూ దాదాపు ప్లేఆఫ్‌కు చేరువ కావడంతో ఆ జట్టును ఆర్సీబీ ఎంతవరకూ నిలువరిస్తుందో చూడాలి. అంతకుముందు ఇరు జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌లో ఢిల్లీ నాలుగు వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఆర్సీబీ జట్టుకు మొయన్‌ అలీ దూరం కావడంతో అతని స్థానంలో హార్డ్‌ హిట్టర్‌ క్లాసెన్‌ తుది జట్టులోకి వచ్చాడు. ఇక టిమ్‌ సౌతీ స్థానంలో శివం దూబే రాగా, అక్షదీప్‌ ప్లేస్‌లో గుర్‌క్రీత్‌ను తీసుకున్నాడు. ఇక ఢిల్లీ జట్టులో మోరిస్‌ స్థానంలో సందీప్‌ లామ్‌చెన్‌ తిరిగి జట్టులో దక్కించుకున్నాడు.

ఢిల్లీ
శ్రేయస్‌ అయ్యర్‌(కెప్టెన్‌), పృథ్వీషా, ధావన్‌, రిషభ్‌ పంత్‌, రూథర్‌ఫర్డ్‌, ఇన్‌గ్రామ్‌, అక్షర్‌పటేల్‌, రబడా, సందీప్‌ లామ్‌చెన్‌, అమిత్‌ మిశ్రా, ఇషాంత్‌ శర్మ

ఆర్సీబీ
విరాట్‌ కోహ్లి(కెప్టెన్‌), పార్థివ్‌ పటేల్‌, ఏబీ డివిలియర్స్‌, స్టోయినిస్‌, క్లాసెన్‌, శివం దూబె, గుర్‌కీరత్‌ సింగ్‌, వాషింగ్టన్‌ సుందర్‌, నవదీప్‌ షైనీ, ఉమేశ్‌ యాదవ్‌, చాహల్‌

Liveblog

మరిన్ని వార్తలు