సైనాకు చుక్కెదురు

16 Oct, 2019 21:47 IST|Sakshi

తొలి రౌండ్‌లోనే ఇంటిబాట

సమీర్‌ వర్మ ముందంజ

డెన్మార్క్‌ ఓపెన్‌

ఓదెన్స్‌(డెన్మార్క్‌): గత కొంతకాలంగా తొలి రౌండ్‌లోనే వెనుదిరుగుతున్న భారత స్టార్‌ షట్లర్‌ సైనా నెహ్వాల్‌కు మరోసారి అదే ఫలితం పునరావృతమైంది. డెన్మార్క్‌ ఓపెన్‌ సూప ర్‌–750 బ్యాడ్మింటన్‌ టోర్నీలో బుధ వారం మహిళల సింగిల్స్‌ తొలి రౌండ్‌ మ్యాచ్‌లో సైనా 15–21, 21–23తో తక హాషి(జపాన్‌) చేతిలో ఓటమి చవిచూసిం ది. లండన్‌ ఒలింపిక్స్‌ కాంస్య పతక విజే త, ప్రపంచ ఎనిమిదో ర్యాంకర్‌ సైనా ఈ మ్యాచ్‌లో తన పూర్తి సామర్థ్యం మేరకు ఆడలేకపోయింది. 

తొలి సెట్‌ను చేజార్చు కున్నాక హోరాహోరీగా సాగిన రెండో సెట్లో సైనా పోరాడినప్పటికీ చివరికి ప్రత్యర్థి ధాటికి పరాజయం పాలైంది. కాగా, పురుషుల సింగిల్స్‌లో సమీర్‌ వర్మ 21–11, 21–11తో సునెయమ (జపాన్‌) ను చిత్తు చేసి ప్రిక్వార్టర్‌ ఫైనల్స్‌కు చేరుకున్నాడు. తదుపరి మ్యాచ్‌లో చెన్‌ లాంగ్‌(చైనా)తో సమీర్‌ తలపడతాడు. మరోవైపు మిక్స్‌డ్‌ డబుల్స్‌లో  ప్రణవ్‌ జెర్రీ చోప్రా– సిక్కిరెడ్డి ద్వయం 21–16, 21–11తో సీడెల్‌–ఎఫ్లర్‌(జర్మనీ) జోడీపై గెలిచి తదుపరి రౌండ్‌కు చేరగా, సాత్విక్‌ సాయిరాజ్‌ రంకిరెడ్డి–అశ్వని పొన్నప్ప ద్వయం ప్రత్యర్థి జోడీ వాంగ్‌–హువాంగ్‌(చైనా)కు వాకోవర్‌ ఇచ్చి పోటీ నుంచి తప్పుకొంది. 
 

Read latest Sports News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

మా దగ్గర సరిపడా డబ్బు ఉంది! 

ఆటలు, ఆతిథ్యం... 

‘అలాంటి అవసరం మాకు లేదు’ 

ఐపీఎల్‌ ఫ్రాంచైజీ ఎస్‌ఆర్‌హెచ్‌ భారీ  విరాళం

ధోని కాదు..మరి ఊతప్ప ఫేవరెట్‌ కెప్టెన్‌ ఎవరు?

సినిమా

సొంత హోట‌ల్‌నే ఇచ్చేసిన సోనూసూద్

కరోనాపై పోరు.. లారెస్స్‌ భారీ విరాళం

నా కొడుకు కోలుకున్నాడు: దర్శకుడు

చిరు ట్వీట్‌పై స్పందించిన పవన్‌ కల్యాణ్‌

నా పేరుతో ట్విటర్‌లో నకిలీ ఖాతా: గోవిల్‌

‘నా అభిమాన హీరో సినిమాలు చూస్తున్నా’