డెన్మార్క్ ధమాక

23 May, 2016 01:16 IST|Sakshi

 తొలిసారి థామస్ కప్ టైటిల్ సొంతం

కున్‌షాన్ (చైనా): ఇన్నాళ్లూ ఆసియా దేశాల ఆధిపత్యం కనిపించిన పురుషుల బ్యాడ్మింటన్ ప్రపంచ టీమ్ చాంపియన్‌షిప్ థామస్ కప్‌లో ఈసారి అంచనాలు తలకిందులయ్యాయి. అందర్నీ ఆశ్చర్యపరుస్తూ యూరోప్ దేశం డెన్మార్క్ విజేతగా అవతరించి చరిత్ర సృష్టించింది. ఆదివారం జరిగిన ఫైనల్లో డెన్మార్క్ 3-2తో గతంలో 13సార్లు చాంపియన్‌గా నిలిచిన ఇండోనేసియాపై విజయం సాధించింది.

67 ఏళ్ల చరిత్ర కలిగిన థామస్ కప్ టోర్నీలో డెన్మార్క్ గతంలో ఎనిమిదిసార్లు ఫైనల్‌కు చేరుకొని రన్నరప్‌తో సరిపెట్టుకోగా... తొమ్మిదో ప్రయత్నంలో విజేతగా నిలిచింది. డెన్మార్క్ తరఫున మూడు సింగిల్స్ మ్యాచ్‌ల్లో విక్టర్ అక్సెల్‌సన్, జార్గెన్‌సన్, విటింగస్ గెలిచి తమ జట్టుకు చిరస్మరణీయ విజయాన్ని అందించారు.

మరిన్ని వార్తలు