బెంగళూరు: బెంగళూరు విధ్వంసకర బ్యాట్స్మన్ ఏబీ డివిలియర్స్ 41 బంతుల్లో హాఫ్ సెంచరీ చేశాడు. తనదైనశైలిలో సిక్స్ బాది డివిలియర్స్ హాఫ్ సెంచరీ సాధించాడు. 10 పరుగుల వద్ద తొలి వికెట్ పడగానే క్రీజులోకి వచ్చిన ఏబీ బెంగళూరును ఆదుకున్నాడు. క్రిస్ గేల్ కేవలం 10పరుగులు చేసి నిరాశపరిచాడు. కెప్టెన్ విరాట్ కోహ్లీ కేవలం ఒక్క పరుగు చేసి వెనుదిరగడంతో బెంగళూరు ఇబ్బందుల్లో పడింది. కానీ, డివిలియర్స్ అడపాదడపా బంతిని బౌండరీలకు తరలిస్తూ స్కోరుబోర్డుకు పరుగులు చేర్చాడు.
14 ఓవర్లు ముగిసేసరికి బెంగళూరు 124 పరుగులకు 4 వికెట్లు కోల్పోయింది. డివిలియర్స్ 57 పరుగులు చేసి రనౌటయ్యాడు. దినేష్ కార్తీక్ 18, సర్ఫరాజ్ ఖాన్ (0) పరుగులతో క్రీజులో ఉన్నారు.