అది నాసిరకమైన అవుట్ ఫీల్డ్ : ఐసీసీ

15 Sep, 2017 12:12 IST|Sakshi
అది నాసిరకమైన అవుట్ ఫీల్డ్ : ఐసీసీ

ఢాకా: గత నెల్లో ఆస్ట్రేలియా-బంగ్లాదేశ్ జట్ల మధ్య జరిగిన తొలి టెస్టు మ్యాచ్ కు ఆతిథ్యమిచ్చిన ఢాకా మైదానంలోని అవుట్ ఫీల్డ్ నాసిరకంగా ఉందంటూ అంతర్జాతీయ క్రికెట్ మండలి(ఐసీసీ) తాజాగా వెల్లడించింది. ఈ మేరకు ఆ మ్యాచ్ కు రిఫరీగా చేసిన జెఫ్ క్రో నివేదిక అందజేసిన తరువాత ఐసీసీ స్పందించింది.

 

దానిపై 14 రోజుల్లో స్పందించాలంటూ బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు(బీసీబీ)ని కోరింది. దానిలో భాగంగా జెఫ్ క్రో నివేదిక బీసీబీకి అందజేసింది. ప్రధానంగా అవుట్ ఫీల్డ్  నాణ్యత ఏమాత్రం బాగాలేదని ఆందోళన వ్యక్తం చేసిన ఐసీసీ.. అంతర్జాతీయ ప్రమాణాలను పాటించడంలో బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు ఎందుకు విఫలమైందో చెప్పాలంటూ వివరణ కోరింది. ఆగస్టు 27 నుంచి 30 వరకూ జరిగిన ఆ మ్యాచ్ లో బంగ్లాదేశ్ 20 పరుగుల తేడాతో విజయం సాధించిన సంగతి తెలిసిందే.

మరిన్ని వార్తలు