రయ్‌ రయ్‌ అంటూ ధోని జీవా బైక్‌ రైడ్‌!

3 Jun, 2020 08:55 IST|Sakshi

రాంచీ: టీమిండియా మాజీ సారథి ఎంఎస్‌ ధోని మరో సారి తన కూతురు జీవాతో కలిసి జాలీగా బైక్‌పై తిరిగాడు. కరోనా లాక్‌డౌన్‌ సమయాన్ని రాంచీలోని ఫామ్‌హౌస్‌లో తన కుటుంబంతో కలిసి ధోని ఎంజాయ్‌ చేస్తున్న విషయం తెలిసిందే. తాజాగా జీవాతో బైక్‌పై ధోని చక్కర్లు కొడుతున్న వీడియో ఒకటి సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది. ధోని సతీమణి సాక్షి ఇన్‌స్టాగ్రామ్ లైవ్ సెషన్‌లో ఉండగా.. ధోనీ బైక్‌పై వచ్చాడు.  సాక్షి దగ్గర ఉన్న జీవాని బైక్‌పై ముందు కూర్చోబెట్టుకుని తీసుకెళ్లి ఫామ్‌హౌస్‌లో తిరగడం.. ఇదంతా లైవ్‌ సెషన్‌లో కనిపిస్తుంటుంది. ఆ వీడియోను ఐపీఎల్‌ ఫ్రాంచైజీ చెన్నై సూపర్‌ కింగ్స్‌ ఇన్‌స్టాలో షేర్‌ చేసింది. (వికెట్‌ కీపర్‌గా గిల్‌క్రిస్ట్‌.. ధోనికి నో చాన్స్‌!)

ధోనికి బైక్‌ రైడ్‌ అంటే ఎంత ఇష్టమో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. రాంచీ వీధుల్లో అర్దరాత్రులు తన స్నేహితులతో కలిసి తిరగడం ఎంతో ఇష్టమని గతంలో పేర్కొన్న విషయం తెలిసిందే. ఇక తన పాత, కొత్త బైక్‌లతో రాంచీలోని ఫామ్‌హౌస్‌లో ఓ గ్యారేజీనే ఏర్పాటు చేశాడు. అంతేకాకుండా ఈ లాక్‌డౌన్‌లో తన పాత బైక్‌లకు ధోనినే స్వయంగ మరమ్మత్తులు చేస్తున్నానడని సాక్షి తెలిపారు. ఇక ఇలా ఫామ్‌హౌస్‌లో జీవా, ధోనిలు బైక్‌పై చక్కర్లు కొట్టడం ఇదే తొలి సారి కాదు. గతంలో కూడా వీరిద్దరు బైక్‌పై తిరుగుతున్న వీడియోనో సాక్షి తన ఇన్‌స్టాలో అభిమానులతో పంచుకున్న సంగతి తెలిసిందే. (ధోని రిటైర్మెంట్‌పై సాక్షి ట్వీట్‌.. డిలీట్‌)

When 'crazy lightning' and 'happiness' are rolled into one! 😍 #VaaMaaMinnal #ThalaDharisanam VC: @sakshisingh_r

A post shared by Chennai Super Kings (@chennaiipl) on

❤️

A post shared by Sakshi Singh Dhoni (@sakshisingh_r) on

Read latest Sports News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా