పరువు నిలిపిన ధోని

10 Dec, 2017 14:00 IST|Sakshi

ధర్మశాల: శ్రీలంకతో జరుగుతున్న తొలి వన్డేలో సీనియర్‌ క్రికెటర్‌ మహేంద్ర సింగ్‌ ధోని టీమిండియా పరువు కాపాడాడు. శ్రీలంక పేసర్‌ సురంగ లక్మల్‌ దాటికి భారత బ్యాట్స్‌మన్‌ పెవిలియన్‌కు క్యూ కట్టారు. 29 పరుగులకే ఏడు వికెట్లు కోల్పోయి కష్టాల్లో ఉన్న టీమిండియా అత్యల్ప స్కోరుకే ఆలౌట్‌ అవుతుందని అందరూ భావించారు. కానీ ధోని గండం నుంచి గట్టెక్కించాడు. ఐదు వికెట్లు కోల్పోయిన అనంతరం క్రీజులోకి వచ్చిన ధోని తనదైన శైలిలో ఆడుతూ అండగా నిలిచాడు.

స్పిన్‌ బౌలర్‌ అయిన కుల్‌దీప్‌తో ఆచితూచి ఆడుతూ భారత స్కోరును 70 పరుగులు దాటించాడు. దీంతో ఇప్పటి వరకు భారత పేరిట ఉన్న అత్యల్ప స్కోరు 54 నుంచి  టీమిండియా గట్టెక్కింది. బ్యాట్స్‌మన్‌లు బంతిని బ్యాట్‌కు తగిలించాడానికే ఇబ్బంది పడుతున్న పరిస్థితుల్లో అనుభవంతో ధోని 5 బౌండరీలు బాదాడు. మరో వైపు కుల్దీప్‌ 19 పరుగులతో చక్కని సాయం అందించాడు. ఈ దశలో 70 పరుగుల వద్ద కుల్దీప్‌ (19) స్టంప్‌ అవుట్‌ కావడంతో భారత్‌ ఎనిమిది వికెట్లు కోల్పోయింది. క్రీజులోకి వచ్చిన బుమ్రాతో ధోని (29) పోరాడుతున్నాడు.

Read latest Sports News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు