టీమిండియా కెప్టెన్‌ ధోనినే!

20 Jul, 2018 10:25 IST|Sakshi

హైదరాబాద్‌: టీమిండియా మూడు మెగా ఐసీసీ టోర్నీలు గెలిచింది మహేంద్ర సింగ్‌ ధోని కెప్టెన్సీలోనే. అయితే 2014లో ఆస్ట్రేలియాతో సిరీస్‌ అనంతంర టెస్టులకు, 2017 ప్రారంభంలో పూర్తి స్థాయిలో సారథ్య బాధ్యతల నుంచి ఈ జార్ఖండ్‌ డైనమెట్‌ తప్పుకున్న విషయం తెలిసిందే. కానీ భారత క్రికెట్‌ నియంత్రణ మండలి (బీసీసీఐ) ప్రకారం ఇప్పటికీ టీమిండియా కెప్టెన్‌ ధోనినే. 

బీసీసీఐ అధికారిక వెబ్‌సైట్‌లో ఆటగాళ్ల సమాచారానికి సంబంధించిన పోర్టల్‌లో ధోనినే కెప్టెన్‌గా ఉంది. దీనిని స్క్రీన్‌షాట్‌ తీసి అభిమానులు సోషల్‌మీడియలో పోస్ట్‌ చేశారు.  ఇప్పుడు నెట్టింట్లో హల్‌చల్‌ చేస్తున్న ఈ ఫోటోపై నెటిజన్లు బీసీసీఐ ఏమరుపాటుతనంపై మండిపడుతున్నారు. ఆలస్యంగా ఈ విషయాన్ని గుర్తించిన బోర్డు అధికారులు చేసిన పొరపాటును సరిదిద్దారు. కానీ అప్పటికే కావాల్సినంత రచ్చ జరిగిపోయింది.  

ఇంగ్లండ్‌ సిరీస్‌లో ఘోరంగా విఫలమైన ఎంఎస్‌ ధోనిపై విమర్శల వర్షం కురుస్తోంది. ఇప్పటికే కొందరు సీనియర్‌ ఆటగాళ్లు, అభిమానులు ఈ ఫినిషర్‌ జట్టు నుంచి తప్పుకుంటే మంచిదని సలహాలు ఇస్తున్న విషయం తెలిసిందే.

 

మరిన్ని వార్తలు