ధోనీ vs బ్రేవో : గెలిచిందెవరు?

28 May, 2018 20:10 IST|Sakshi
ఆనందంలో బ్రేవో, ధోని

సాక్షి, స్పోర్ట్స్‌ : ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ -11వ సీజన్‌లో త్రీ రన్స్‌ చాలెంజ్‌ బాగా పాపులర్‌ అయింది. చెన్నై సూపర్‌ కింగ్స్‌ కెప్టెన్‌ ధోనితో ఆ జట్టు ఆల్‌రౌండర్‌ డ్వేన్‌ బ్రేవో ఈ పోటీలో పాల్గొన్నారు. మరి ఇద్దరిలో గెలిచిందెవరూ?. ఇంకెవరు వయసు మీద పడుతున్నా యువ ఆటగాళ్లకు సవాలు విసురుతున్న ధోనినే నెగ్గాడు.

అవును. ధోని, బ్రేవోలు ఇద్దరు హోరాహోరీగా వికెట్ల మధ్య పరుగులు తీశారు. అయితే, బ్రేవో కంటే కొన్ని ఇంచ్‌ల ముందు క్రీజులో బ్యాట్‌ను పెట్టిన ధోని గెలుపొందాడు. అవార్డుల ప్రధానోత్సవం తర్వాత చాలాసేపు  చెన్నై ఆటగాళ్లంతా మైదానంలో సందడి చేస్తూ గడిపారు. ఈ సమయంలోనే బ్రేవో-ధోనిల మధ్య త్రీ రన్స్‌ ఛాలెంజ్‌ నిర్వహించారు. ఇంకెందుకు ఆలస్యం ఆ వీడియోను చూసేయ్యండి.

మరిన్ని వార్తలు