ధోని కొత్త అవతారం!

30 Aug, 2019 13:47 IST|Sakshi

న్యూయార్క్‌: రెండు నెలల పాటు క్రికెట్‌ నుంచి విశ్రాంతి తీసుకున్న భారత క్రికెట్‌ జట్టు మాజీ కెప్టెన్‌ ఎంఎస్‌ ధోని.. యూఎస్‌లో గోల్ఫ్‌ ఆడుతూ కొత్త అవతారంలో కనిపించాడు. గోల్ఫ్‌ ఆడే క్రమంలో ముఖానికి తెల్లరంగు పూసుకుని ఉన్న ధోని ఫోటో ఇప్పుడు వైరల్‌గా మారింది.  గురువారం జాతీయ క్రీడల దినోత్సవం కావడంతో ధోని ఇలా సెలబ్రేట్‌ చేసుకున్నాడు. టీమిండియా సహచర ఆటగాడు కేదార్‌ జాదవ్‌తో కలిసి ధోని గోల్ఫ్‌ ఆడాడు.  దీనికి సంబంధించిన ఫోటోను కేదార్‌ జాదవ్‌ తన ఇన్‌స్టాగ్రామ్‌ అకౌంట్‌లో పోస్ట్‌ చేశాడు. ఇది కాస్తా వైరల్‌గా మారింది.

ప్రస్తుతం విండీస్‌తో జరుగుతున్న రెండు టెస్టుల  సిరీస్‌లో సభ్యుడిగా లేని జాదవ్‌.. ధోనితో కలిసి గోల్ఫ్‌ క్రీడను ఆస్వాదించాడు. పారామిలటరీ రెజిమెంట్‌లో సేవ చేసేందుకు రెండు నెలల పాటు క్రికెట్‌ నుంచి ధోని వైదొలిగిన సంగతి తెలిసిందే. భారత సైన్యంలో 106 టీఏ పారా బెటాలియన్‌తో కలిసి 15 రోజుల పాటు ధోని పనిచేశాడు. జూలై 30వ తేదీ నుంచి ఆర్మీ బెటాలియన్‌లో శిక్షణ తీసుకోవడంతో అక్కడ విధుల్లో పాల్గొన్నాడు. కాగా, దక్షిణాఫ్రికాతో వచ్చే నెలలో ఆరంభం కానున్న టీ20 సిరీస్‌కు సైతం ధోని అందుబాటులో ఉండటం లేదు. టీమిండియా ప్రకటించిన జట్టులో పక్కకు పెట్టడంతో మరికొంత కాలం ధోని విశ్రాంతి తీసుకోవాలనే విషయం స్పష్టమైంది.

Happy #NationalSportsDay to all of you. Remembering Dhyanchand Ji, the wizard of hockey... #nationalsportsday 🏏 🎾 ⚽️ 🏋🏻‍♂️ 🚲 🏃‍♂️

A post shared by Kedar Jadhav (@kedarjadhavofficial) on


 

Read latest Sports News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా