మహేంద్ర సింగ్ ధోనీ@333.3

7 Mar, 2016 17:38 IST|Sakshi
మహేంద్ర సింగ్ ధోనీ@333.3

ఢాకా: భారత కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీలో మునుపటి వాడి తగ్గిందన్న విమర్శలకు బ్యాట్తోనే సమాధానం చెప్పాడు. ఆసియా కప్ ఫైనల్లో మరోసారి బెస్ట్ మ్యాచ్ ఫినిషర్ అవతారమెత్తి భారత్కు కప్ అందించాడు. బంగ్లాదేశ్లో జరిగిన ఈ మ్యాచ్లో టీమిండియా 8 వికెట్లతో ఘనవిజయం సాధించిన సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్లో ఆరే బంతులాడిన ధోనీ ఫోర్, 2 సిక్సర్లతో 20 పరుగులతో నాటౌట్గా నిలిచాడు. ధోనీ స్ట్రయిక్ రేట్ 333.3. టి-20 ఫార్మాట్లో మహీ కనీసం ఆరుబంతులు ఆడినపుడు ఇదే అత్యధిక స్ట్రయిక్ రేట్. ఈ మ్యాచ్ విశేషాలు..

  • అంతర్జాతీయ క్రికెట్లో ధోనీ మొత్తం 202 సిక్సర్లు బాదాడు. టెస్టుల్లో 78, వన్డేల్లో 192, టి-20ల్లో 32 సిక్సర్లు సంధించాడు.
  • అత్యధిక సిక్సర్లు కొట్టిన ఆటగాళ్ల ఆల్టైమ్ జాబితాలో ధోనీ ఐదో స్థానంలో నిలిచాడు. అఫ్రిదీ, క్రిస్ గేల్, బ్రెండన్ మెకల్లమ్, జయసూర్య తర్వాతి స్థానంలో నిలిచాడు.
  • ఈ మ్యాచ్లో శిఖర్ ధవన్ చేసిన 60 పరుగులే టి-20 ఫార్మాట్లో అతనికిది అత్యధిక వ్యక్తిగత స్కోరు.
  • 2014 నుంచి పొట్టి క్రికెట్లో టీమిండియా గెలుపోటముల రికార్డు 16-6.
  • అంతర్జాతీయ టి-20ల్లో భారత్కిది వరుసగా ఏడో విజయం. భారత్ చివరిసారి శ్రీలంకతో పుణె మ్యాచ్లో ఓడింది.

మరిన్ని వార్తలు