బీసీసీఐ ప్రతిపాదనకు సీనియర్‌ క్రికెటర్‌ నో? 

27 Jul, 2019 20:07 IST|Sakshi

న్యూఢిల్లీ : ప్రపంచకప్‌ నిష్క్రమణతో భారత జట్టులో విభేదాలు నెలకొన్నాయని, ముఖ్యంగా కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి, వైస్‌ కెప్టెన్‌ రోహిత్‌ శర్మలకు పడటం లేదని సోషల్‌ మీడియా వేదికగా ప్రచారం జరుగుతుండటం.. మీడియాలో వరుస కథనాలు రావడం తెలిసిందే. అయితే ఈ ప్రచారానికి ఫుల్‌ స్టాప్‌ పెట్టే ప్రయత్నం బీసీసీఐ, సుప్రీం నియమిత పాలక మండలి (సీఓఏ) చేసినట్లు తెలుస్తోంది. సోషల్‌ మీడియా వేదికగా జరుగుతున్న ప్రచారానికి అక్కడే ముగింపు పలకాలని యోచించినట్లు సమాచారం. అసలు జట్టులో గొడవలే లేవని, అంతా బాగుందని ఓ సీనియర్‌ ఆటగాడితో సోషల్‌ మీడియా వేదికగా పోస్ట్‌ పెట్టించే ప్రయత్నం జరిగినట్లు బోర్డ్‌ సీనియర్‌ అధికారి ఒకరు మీడియాకు తెలిపారు.

‘భారత జట్టులో విభేదాలు అంటూ మీడియాలో వస్తున్న కథనాలపై కలవరపాటుకు గురైన సీఓఏ వాటికి ఫుల్‌ స్టాప్‌ పెట్టే ప్రయత్నం చేసింది. ఈ మేరకు ఒక సభ్యుడు జట్టులో ఎలాంటి గొడవలు లేవని, అంతా సవ్యంగానే ఉందనే స్టేట్‌మెంట్‌ ఇవ్వాలని ఓ సీనియర్‌ ఆటగాడిని కోరాడు. కానీ ఈ విషయంలో ఇప్పటి వరకు ఎలాంటి పురోగతి లేదు’ అని ఆ అధికారి పేర్కొన్నారు. మీడియాలో వచ్చే కథనాలపై సీఓఏ ఎన్నటికీ స్పందించదని, ఆటగాళ్లకు సమస్యలుంటే వారే తమ ముందుకు తీసుకు వస్తారని తెలిపారు. అప్పటి వరకు ఆటగాళ్ల మధ్య ఎలాంటి గొడవలు లేవనే సీవోఏ భావిస్తోందన్నారు. అయితే రోహిత్‌ శర్మ, కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి సతీమణి అనుష్క​ శర్మను ఇన్‌స్టాగ్రామ్‌ వేదికగా అన్‌ఫాలో కావడంతో ఈ ప్రచారానికి మరింత ఆజ్యం పోసినట్లైందని, అందుకే సీఓఏ జోక్యం చేసుకోవాల్సి వచ్చిందని ఆ అధికారి పేర్కొన్నారు. అయితే సీఓఏ ప్రతిపాదనను ఆ సీనియర్‌ ఆటగాడు తిరస్కరించినట్లు అనధికారికంగా తెలిసింది.

మరో అధికారి మాట్లాడుతూ.. జట్టుపై జరుగుతున్న ప్రచారానికి ఎంత త్వరగా ముగింపు పలికితే అంత మంచిదని, లేకుంటే ఆటగాళ్ల ప్రదర్శనపై ప్రభావం చూపుతుందన్నారు. ‘ఆటగాళ్ల మధ్య విభేదాలుంటే అది జట్టు ప్రదర్శనపై ప్రభావం చూపుతోంది. ఈ సమస్యను ఇప్పుడే పరిష్కరించకపోతే ఆటగాళ్ల మధ్య సఖ్యత దెబ్బతీనడంతో పాటు ఫలితంపై ప్రభావం చూపుతోంది. ఇదంతా మీడియా సృష్టేనని ఓ పెద్దాయన అన్నారు. మీడియా సృష్టి అయినప్పుడు ఎందుకు కలవరపాటుకు గురవుతున్నారు?’ అని సదరు అధికారి ప్రశ్నించారు.

చదవండి: అగ్గి రాజేసిన రోహిత్‌ ‘అన్‌ఫాలో’ వివాదం! 

Read latest Sports News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

టీమిండియాలో ప్రక్షాళన జరగాల్సిందే : మాజీ క్రికెటర్‌

స్టోక్స్‌కు ప్రమోషన్‌.. ఆర్చర్‌ అరంగేట్రం

లార్డ్స్‌ పిచ్‌పై రూట్‌ గరంగరం!

‘పెయిన్‌ కిల్లర్స్‌తోనే ప్రపంచకప్‌ ఆడాను’

మీలాంటి వాళ్లను క్రికెట్‌ ఆడకుండా చేసేవాడ్ని!

ఆమిర్‌ తొందరపడ్డాడు : వసీం అక్రం

రవిశాస్త్రి వైపే మొగ్గు?

'అస్సామి దాల్‌ వండడంలో తాను స్పెషలిస్ట్‌'

నదీమ్‌కు 10 వికెట్లు!

ఆసీస్‌ యాషెస్‌ జట్టు ఇదే..

భారత్‌ పోరాటం ముగిసింది..

మహ్మద్‌ షమీకి యూఎస్‌ వీసా నిరాకరణ

‘మ్యాచ్‌ విన్నర్లలో అతనిదే టాప్‌ ప్లేస్‌’

కాకినాడ కుర్రాడు వెస్టిండీస్‌ టూర్‌కు

బంగర్‌కు ఉద్వాసన..భరత్‌కు భరోసా!

చాంపియన్‌ ఆర్మీ గ్రీన్‌ జట్టు

బేస్‌బాల్‌ క్యాంప్‌నకు మనోళ్లు ముగ్గురు

అయ్యో... ఐర్లాండ్‌

టైటాన్స్‌ తెలుగు నేలపై చేతులెత్తేసింది..!

సింధు ఔట్‌.. సెమీస్‌లో ప్రణీత్‌

మలింగకు ఘనంగా వీడ్కోలు

ఫైనల్లో నిఖత్, హుసాముద్దీన్‌

ఆఖరి వన్డేలోనూ అదుర్స్‌

టైటాన్స్‌ది అదే కథ.. అదే వ్యథ

యూపీ యోధ మరోసారి చిత్తుచిత్తుగా..

ఐర్లాండ్‌ ఇంత దారుణమా?

ధోని స్థానాన్ని భర్తీ చేయగలను.. కానీ

నిషేధం తర్వాత తొలిసారి జట్టులోకి..

ధోని ఆర్మీ ట్రైనింగ్‌.. గంభీర్‌ కామెంట్‌

‘ధోనికి ప్రత్యేక రక్షణ అవసరం లేదు’

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

సంపూ ట్వీట్‌.. నవ్వులే నవ్వులు

బిగ్‌బాస్‌.. జాఫర్‌, పునర్నవి సేఫ్‌!

దిల్ రాజు ప్యానల్‌పై సీ కల్యాణ్ ప్యానల్‌ ఘనవిజయం

ఇది ‘మహర్షి’ కలిపిన బంధం

ప్రేమలో పడ్డ ‘చిన్నారి’ జగదీశ్‌!

కన్నడనాట ‘కామ్రేడ్‌’కి కష్టాలు!