'నాకు పింక్ బాల్ ఓకే'

25 Oct, 2016 12:37 IST|Sakshi
'నాకు పింక్ బాల్ ఓకే'

అడిలైడ్: తనకు పింక్ బాల్ తో ఎటువంటి ఇబ్బందులు ఎదురుకాలేదని దక్షిణాఫ్రికా స్టార్ ఆటగాడు డీ కాక్ స్పష్టం చేశాడు. క్రికెట్ ఆస్ట్రేలియా ఎలెవన్తో జరిగిన రెండు రోజుల ప్రాక్టీస్ మ్యాచ్లో డీ కాక్(122 రిటైర్డ్ అవుట్;103 బంతుల్లో 16 ఫోర్లు, 3 సిక్సర్లు)తో శతకం సాధించాడు. అనంతరం పింక్ బాల్పై డీ కాక్ మాట్లాడుతూ.. డే అండ్ నైట్ లో ఉపయోగించే పింక్ బంతికి, డే మ్యాచ్ల్లో ఉపయోగించే బంతికి తేడా ఏమీ కనిపించలేదన్నాడు. అసలు దాని గురించి కూడా తాను పెద్దగా ఆలోచించలేదన్నాడు.

 

'బంతి ఏదైనా బంతే.  పరిస్థితులన్ని బట్టి నేను ఆడతా. నా వరకూ పింక్ బాల్తో ఇబ్బంది అనిపించలేదు' అని డీ కాక్ పేర్కొన్నాడు. ఇదిలా ఉండగా, ఆటగాళ్ల వ్యక్తిగత ప్రదర్శనను బట్టి పింక్ బాల్ పని తీరును అంచనా వేయొద్దని డీ కాక్ తెలిపాడు. తాను క్రీజ్లోకి వెళ్లిన తరువాత డకౌట్ అయినా, సెంచరీ చేసినా అది బాల్ మార్పుతో వచ్చిన ఫలితం కాదన్నాడు. ఆస్ట్రేలియాతో మూడు టెస్టుల సిరీస్లో భాగంగా చివరి టెస్టును పింక్ బాల్ తో నిర్వహించనున్నారు. నవంబర్ 24 వ తేదీన అడిలైడ్లో దక్షిణాఫ్రికా-ఆస్ట్రేలియా జట్ల మధ్య పింక్ బాల్ మ్యాచ్ జరుగనుంది. దానిలో భాగంగా దక్షిణాఫ్రికా ఇప్పటికే ఒక పింక్ బాల్ ప్రాక్టీస్ మ్యాచ్ను ఆడగా, మూడో టెస్టుకు ముందు మెల్ బోర్న్లో మరో పింక్ బాల్ మ్యాచ్ను సఫారీలు ఆడనున్నారు.

>
మరిన్ని వార్తలు