‘కోహ్లిలా ఆడటం చాలా కష్టం’

27 Nov, 2017 09:33 IST|Sakshi

నాగ్‌పూర్‌: శ్రీలంకతో జరుగుతున్న రెండో టెస్టులో డబుల్‌ సెంచరీతో మెరిసిన కెప్టెన్‌ విరాట్‌ కోహ్లిపై సర్వత్రా ప్రశంసల జల్లు కురుస్తోంది. సహచర ఆటగాడు నాగ్‌పూర్‌ సెంచరీ హీరో చతేశ్వర పుజారా కూడా కోహ్లిని పొగడ్తలతో ముంచెత్తాడు. మ్యాచ్‌ అనంతరం కోహ్లిలా వేగంగా ఇతర బ్యాట్స్‌మన్‌ పరుగులు ఎందుకు చేయలేకపోతున్నారని మీడియా అడిగిన ప్రశ్నకు.. కోహ్లిలా ఇతరులు ఆడటం చాల కష్టమని పుజారా అభిప్రాయపడ్డాడు.  

‘కోహ్లి కెరీర్‌ ఆరంభం నుంచే అన్ని ఫార్మట్లలో రాణించాడు. ఇతర క్రికెటర్లు అతనిలా రాణించలేదు. కోహ్లి ఆత్మవిశ్వాసమే అతన్ని ఇలా ఆడేలా చేసింది. గత మూడేళ్ల నుంచి కోహ్లి కొనసాగించిన స్ట్రైక్‌ రేట్‌ను ఇతర ఆటగాళ్లు కొనసాగించడం చాల కష్టం. బ్యాటింగ్‌కు ఏమాత్రం అనుకూలించిన ఈ పిచ్‌పై అందివచ్చిన అవకాశాన్ని ఉపయోగించుకుంటూ భారీ స్కోరు చేశామని’ పుజారా తెలిపాడు.

గంటలకొద్ది క్రీజులో గడపడంపై..
ఫిట్‌నెస్‌తోనే గంటలకొద్ది క్రీజులో ఆడగలుగుతున్నాను. గత రెండన్నరేళ్లుగా ఫిట్‌నెస్‌పై ప్రత్యేక ధృష్టి సారించాను. దీంతోనే అలవోకగా సింగిల్స్‌, డబుల్స్‌ తీయగలుగుతున్నాను. దీనికి గత సిరీస్‌ అనుభవాలు, ఇంగ్లండ్‌ కౌంటీ క్రికెట్‌ కూడా ఉపయోగపడిందని భావిస్తున్నా. ఓవర్‌సీస్‌ కండీషన్‌లో రాణించేలా బ్యాటింగ్‌ నైపుణ్యాన్ని మెరుగుపరుచుకున్నాను. దక్షిణాఫ్రికా పర్యటనలో రాణిస్తానని పుజారా ఆశాభావం వ్యక్తం చేశాడు.

>
మరిన్ని వార్తలు