చరిత్ర సృష్టించిన దీపా కర్మాకర్‌

9 Jul, 2018 03:38 IST|Sakshi
దీపా కర్మాకర్‌

ప్రపంచకప్‌ జిమ్నాస్టిక్స్‌ టోర్నీలో పసిడి పతకం

న్యూఢిల్లీ: రెండేళ్ల విరామం తర్వాత బరిలోకి దిగిన తొలి అంతర్జాతీయ టోర్నమెంట్‌లోనే భారత మహిళా అగ్రశ్రేణి జిమ్నాస్ట్‌ దీపా కర్మాకర్‌ పసిడి పతకంతో సత్తా చాటింది. టర్కీ లో జరిగిన ఆర్టిస్టిక్‌ జిమ్నాస్టిక్స్‌ వరల్డ్‌ చాలెంజ్‌ కప్‌లో దీపా వాల్ట్‌ ఈవెంట్‌లో స్వర్ణం చేజిక్కించుకుంది. ఫైనల్లో ఆమె 14.150 పాయింట్లతో అగ్రస్థానంలో నిలిచింది. అంతకుముందు క్వాలిఫయింగ్‌ రౌండ్‌లో 13.400 పాయింట్లతో తొలి స్థానంలో నిలిచి ఫైనల్‌కు అర్హత సాధించింది. ఈ ప్రదర్శనతో దీపా కర్మాకర్‌ ప్రపంచకప్‌ చరిత్రలో పతకం నెగ్గిన రెండో భారతీయ జిమ్నాస్ట్‌గా, స్వర్ణ పతకం నెగ్గిన తొలి జిమ్నాస్ట్‌గా చరిత్ర సృష్టించింది. ఈ ఏడాదే తెలంగాణ జిమ్నాస్ట్‌ బుద్దా అరుణా రెడ్డి మెల్‌బోర్న్‌లో జరిగిన ప్రపంచకప్‌లో కాంస్యం సాధించింది. 

మరిన్ని వార్తలు