దీపికా పళ్లికల్‌ కాంస్యంతో సరి

25 Aug, 2018 15:23 IST|Sakshi

జకార్తా: ఏషియన్‌ గేమ్స్‌ 2018 స్క్వాష్‌ మహిళల సింగిల్స్‌లో భారత క్రీడాకారిణి దీపికా పళ్లికల్‌ కాంస్యంతో సరిపెట్టుకుంది. శనివారం జరిగిన సెమీ ఫైనల్లో దీపికా పళ్లికల్‌ 0-3 తేడాతో డేవిడ్‌ నికోలాన్‌(మలేసియా) చేతిలో ఓటమి పాలైంది. దాంతో ఫైనల్‌కు చేరి రజతం సాధించాలన్నా దీపికా ఆశలు నెరవేరలేదు.  కాగా, కాంస్యం దక్కడంతో ఏడో రోజు ఆటలో భారత్‌ పతకాల బోణీ కొట్టింది. మరొక స్క్వాష్‌ మహిళల సింగిల్స్‌ సెమీ ఫైనల్లో జ్యోష్నచిన్నప్ప పరాజయం చెందింది. మలేసియా క్రీడాకారిణి శివసాంగారి చేతిలో జ్యోష్న చిన్నప్ప 1-3 తేడాతో ఓటమి చెంది కాంస్యంతో సంతృప్తి చెందింది. ఫలితంగా భారత్‌ పతకాల సంఖ్య 27కు చేరింది. ఇందులో ఆరు స్వర్ణాలు, ఐదు రజతాలు, పదహారు కాంస్య పతకాలున్నాయి.

ఇదిలా ఉంచితే, ఈ రోజు ఆటలో భారత బ్యాడ్మింటన్‌ క్రీడాకారిణులు సైనా నెహ్వాల్‌, పీవీ సింధులు క్వార్టర్స్‌లోకి ప‍్రవేశించారు. ప్రిక్వార్టర్‌ ఫైనల్లో సైనా నెహ్వాల్‌ 21-6, 21-14 తేడాతో ఫిత్రియాని(ఇండోనేసియా)పై విజయం సాధించి క్వార్టర్స్‌లోకి ప్రవేశించగా, ఆపై జరిగిన మరో ప‍్రిక్వార్టర్‌ పోరులో పీవీ సింధు 21-12, 21-15 తేడాతో టంజంగ్‌ జార్జియా(ఇండోనేసియా)పై గెలిచి రౌండ్‌-16లోకి ప‍్రవేశించింది.

మరిన్ని వార్తలు