దిశా, ముజ్తబాలకు స్వర్ణాలు

17 Oct, 2019 10:09 IST|Sakshi

స్పోర్ట్స్‌ ఫర్‌ ఆల్‌ టోర్నమెంట్‌

సాక్షి, హైదరాబాద్‌: పాఠశాల విద్యార్థులకు క్రీడలపై ఆసక్తి పెంపొందించేందుకు నిర్వహిస్తోన్న స్పోర్ట్స్‌ ఫర్‌ ఆల్‌ (ఎస్‌ఎఫ్‌ఏ) చాంపియన్‌షిప్‌లో ప్రజ్ఞయ మాంటిస్సోరి, కేంద్రీయ విద్యాలయ స్కూల్‌ విద్యార్థులు వరుసగా దిశా సింఘాల్, ముజ్తబా అలీ మొహమ్మద్‌ మెరిశారు. గచ్చిబౌలి జరుగుతోన్న ఈ టోర్నీ అండర్‌–9 కరాటే కటా ఈవెంట్‌లో దిశా పసిడి పతకాన్ని గెలుచుకోగా... కెన్నడీ హై ద గ్లోబల్‌ స్కూల్‌ విద్యార్థి భార్గవి రజత పతకాన్ని సొంతం చేసుకుంది. మరోవైపు ఆర్చరీ ఈవెంట్‌లో మజ్తబా స్వర్ణాన్ని కైవసం చేసుకున్నాడు. అండర్‌–19 బాలుర ఆర్చరీ రికర్వ్‌ ఈవెంట్‌లో ముజ్తబా విజేతగా నిలిచాడు. అగీ్నవ (ఓబుల్‌ రెడ్డి పబ్లిక్‌ స్కూల్‌), తజమ్ముల్‌ (నారాయణన్‌ జూనియర్‌ కాలేజి) రజత, కాంస్య పతకాలను సాధించారు. 

కాంపౌండ్‌ విభాగంలో ఆర్యన్‌ (ఢిల్లీ పబ్లిక్‌ స్కూల్‌) బంగారు పతకాన్ని అందుకోగా... హర్‌్ష (శ్రీ హనుమాన్‌ వ్యాయామశాల) రజతాన్ని గెలుచుకున్నాడు. బ్రిలియంట్‌ గ్రామర్‌ స్కూల్‌కు చెందిన ప్రథమ్‌ కాంస్యాన్ని సాధించాడు. అండర్‌–14  బాలికల కేటగిరీలో కశ్వి అగర్వాల్‌ (భారతీయ విద్యా భవన్‌), అక్షర (సన్‌ఫ్లవర్‌ వేదిక్‌ స్కూల్‌) వరుసగా స్వర్ణ, రజతాలను సొంతం చేసుకున్నారు. శ్రేష్టారెడ్డి (పల్లవి ఇంటర్నేషనల్‌ స్కూల్‌) కాంస్య పతకాన్ని గెలుచుకుంది. అండర్‌–11 బాలికల కటా ఈవెంట్‌లో శిక్ష (భవన్స్‌ శ్రీ రామకృష్ణ), రినీషా యాదవ్‌ (సూర్య ద గ్లోబల్‌ స్కూల్‌), షగుణ్‌ (కేంద్రీయ విద్యాలయ) తొలి మూడు స్థానాలను దక్కించుకున్నారు. 

Read latest Sports News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

ఒలింపిక్స్‌ రీషెడ్యూల్‌ ఇదే..

‘ఇంకా వరల్డ్‌ చాంపియన్‌ కాలేదు కదా’

‘నువ్వెంత ఇచ్చావ్‌’ అనడం దారుణం

ధోని టార్గెట్‌ రూ. 30 లక్షలే..

స్టీవ్‌ స్మిత్‌పై ‘నిషేధం’ ముగిసింది

సినిమా

కరోనా: నారా రోహిత్‌ భారీ విరాళం

సిగ్గుప‌డ‌ను.. చాలా వింత‌గా ఉంది

అందుకే మేం విడిపోయాం: స్వరభాస్కర్‌

క‌రోనా వార్డులో సేవ‌లందిస్తోన్న న‌టి

మరోసారి బుల్లితెరపై బిగ్‌బాస్‌

ప్రభాస్‌, బన్నీ మళ్లీ ఇచ్చారు!