విధ్వంసకర ఆటపట్టు అవుట్‌..

5 Jul, 2017 22:42 IST|Sakshi
విధ్వంసకర ఆటపట్టు అవుట్‌..

డెర్బీ: శ్రీలంక డేంజరేస్‌ బ్యాట్‌ ఉమెన్‌ చమరి ఆటపట్టు (25) అవుటైంది. పూనమ్‌ యాదవ్‌ వేసిన 17 ఓవర్‌ నాలుగో బంతికి క్లీన్‌ బౌల్డ్‌ గా పెవిలియన్ చేరింది. ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్‌లో ఏకంగా 22 ఫోర్లతో 178 పరుగులు సాధించి రికార్డు నెలకొల్పిన విషయం తెలిసిందే. 233 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన శ్రీలంకకు ఆదిలో  పెరారా(10) వికెట్‌ కోల్పోయి ఎదురు దెబ్బ తగిలింది. అనంతరం క్రీజులోకి వచ్చిన ఆటపట్టు మరో ఓపెనర్‌ హన్సిక తో ఆచూతూచి ఆడుతూ ఇన్నింగ్స్‌ను ముందుకు నడిపించింది.

వీలు చిక్కినప్పుడల్లా బౌండరీలు బాదుతూ 47 పరుగుల భాగస్వామ్యంతో క్రీజులో పాతుకుపోతున్న ప్రమాదకరంగా మారుతున్న ఈ జంటను పూనమ్‌ చక్కటి బంతితో వీడదీసింది. ఇక క్రీజులో హన్సిక (23) సిరి వర్దనే (4) క్రీజులో ఆడుతున్నారు. 21 ఓవర్లు ముగిసేసరికి శ్రీలంక మహిళలు 2 వికెట్లు కోల్పోయి 64 పరుగులు చేశారు. ఇక భారత బౌలర్లలో గోస్వామి, పూనమ్‌ యాదవ్‌ చెరో వికెట్‌ దక్కించుకున్నారు.

మరిన్ని వార్తలు