'సచిన్ ను అవుట్ చేసిన ఆ క్షణాలే'

10 Jun, 2016 17:20 IST|Sakshi
'సచిన్ ను అవుట్ చేసిన ఆ క్షణాలే'

కోల్కతా: మాస్టర్ బ్లాస్టర్, దిగ్గజ ఆటగాడు సచిన్ టెండూల్కర్ క్రికెట్ ఆడినన్ని రోజులూ అతన్ని అవుట్ చేయాలని ప్రతీ బౌలర్ లెక్కకు మించే శ్రమించే వాడు. అది అంతర్జాతీయ మ్యాచ్ అయినా, ఫస్ట్ క్లాస్ మ్యాచ్ అయినా సచిన్ ను అవుట్ చేయడమే లక్ష్యంగా బౌలర్లు తమ అస్త్రాలను సిద్ధం చేసుకునేవారు.  అలా సచిన్ ను ఒకే ఇన్నింగ్స్ లో రెండు సార్లు అవుట్ చేస్తే ఇంకేముంటుంది. ఆ బౌలర్ ఆనందం ఆకాశాన్ని తాకుతుంది. అలాంటి అరుదైన అవకాశాన్ని గతంలో దక్కించుకున్న బెంగాల్ క్రికెటర్ సౌరాషిష్ లహిరి..  ఆ విషయాన్ని తాజాగా షేర్ చేసుకున్నాడు.  గురువారం అన్ని ఫార్మాట్ల క్రికెట్కు గుడ్ బై చెప్పిన లహిరి.. సచిన్ ను గతంలో వరుసగా రెండు సార్లు అవుట్ చేసిన క్షణమే తన జీవితంలో అత్యంత మధురమైనదని స్పష్టం చేశాడు. అదే తన క్రీడా జీవితంలో అతి పెద్ద ఘనత అని లహిరి తెలిపాడు.

 

ఇప్పటివరకూ 100 ఫస్ట్ క్లాస్ మ్యాచ్లాడిన లాహిరి తన క్రికెట్ కెరీర్కు గురువారం గుడ్ బై చెప్పాడు. 2000వ సంవత్సరంలో క్రికెట్ లో కి అడుగుపెట్టిన లహరి ఫస్ట్ క్లాస్ క్రికెట్ లో 256 వికెట్లు సాధించగా, లిస్-ఏ, టీ 20ల్లో 93 వికెట్లు తీశాడు. 2015-16వ సీజన్లో బెంగాల్ తరపున ఒక్క మ్యాచ్ కూడా ఆడని లహిరి ఎట్టకేలకు తన క్రికెట్ కెరీర్ను ముగిస్తున్నట్లు ప్రకటించాడు. ఈ నేపథ్యంలో 2007లో ఫిబ్రవరిలో జరిగిన రంజీ సూపర్ లీగ్ ఫైనల్ మ్యాచ్ లో ముంబై ఆటగాడు సచిన్ రెండు సార్లూ అవుట్ చేసిన విషయాన్ని లహిరి ప్రస్తావించాడు. అదొక అద్భుతమైన క్షణమని లహిరి తెలిపాడు.

>
మరిన్ని వార్తలు