ఆర్సీబీ గెలిస్తేనే..!

17 May, 2018 19:37 IST|Sakshi

బెంగళూరు : ఇండియన్‌ ప‍్రీమియర్‌ లీగ్‌(ఐపీఎల్‌)లో భాగంగా గురువారం ఇక్కడ చిన్నస్వామి స్టేడియంలో రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరుతో జరుగుతున్న మ్యాచ్‌లో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ టాస్‌ గెలిచి ఫీల్డింగ్‌ ఎంచుకుంది. టాస్‌ గెలిచిన సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ కెప్టెన్‌ కేన్‌ విలియమ్సన్‌.. ముందుగా ఆర్సీబీకి బ్యాటింగ్‌కు ఆహ్వానించాడు. అంతకముందు ఇరు జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌లో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ 5 పరుగుల తేడాతో విజయం సాధించింది.

ఈ సీజన్‌లో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ ఇప్పటివరకూ  12 మ్యాచ్‌లు ఆడి 9 విజయాలతో అగ్రస్థానంలో కొనసాగుతుండగా, ఆర్సీబీ 12 మ్యాచ్‌లకు గాను ఐదు విజయాల్ని సాధించి ఏడో స్థానంలో ఉంది. ఇప్పటికే సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ ప్లే ఆఫ్‌లోకి అడుగుపెట్టగా, ఆర్సీబీ ఇంకా ప్లే ఆఫ్‌ వేటలోనే ఉంది. ఆర్సీబీకి సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌తో మ్యాచ్‌ కాకుండా ఒక మ్యాచ్‌ మాత్రమే మిగిలి ఉంది. ఈ రెండు మ్యాచ్‌ల్లోనూ ఆర్సీబీ గెలిస్తేనే ప్లే ఆఫ్‌ రేసులో నిలుస్తుంది. హైదరాబాద్‌తో మ్యాచ్‌లో ఓడితే మాత్రం ఆర్సీబీ ఎటువంటి సమీకరణాలు లేకుండా ఇంటిదారి పడుతుంది.

తుది జట్లు

రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూర్‌ 
విరాట్‌ కోహ్లి(కెప్టెన్‌), పార్థీవ్‌ పటేల్‌, మొయిన్‌ అలీ, ఏబీ డివిలియర్స్‌, మన్‌దీప్‌ సింగ్‌, సర్ఫరాజ్‌  ఖాన్‌, గ్రాంగ్‌ హోమ్‌, టిమ్‌ సౌథీ, ఉమేశ్‌ యాదవ్‌, సిరాజ్‌, యుజ్వేంద్ర చహల్‌

సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ 
కేన్‌ విలియమ్సన్‌(కెప్టెన్‌), శిఖర్‌ ధావన్‌, అలెక్స్‌ హేల్స్‌, మనీష్‌ పాండే, దీపక్‌ హుడా, షకీబుల్‌ హసన్‌, శ్రీవాత్స గోస్వామి, రషీద్‌ ఖాన్‌, సిద్దార్థ్‌ కౌల్‌, సందీప్‌ శర్మ, బసిల్‌ థంపి
 

మరిన్ని వార్తలు