'నా దగ్గరేమీ మ్యాజిక్ లేదు'

18 Apr, 2016 19:48 IST|Sakshi
'నా దగ్గరేమీ మ్యాజిక్ లేదు'

కరాచీ:గత కొంతకాలంగా పేలవమైన ప్రదర్శనతో వెనుకబడిపోయిన పాకిస్తాన్ క్రికెట్లో ఆకస్మిక మార్పులను ఆశించడం ఎంతమాత్రం సమంజసం కాదని ఆ దేశ క్రికెట్ చీఫ్ సెలక్టర్గా ఎన్నికైన ఇంజమామ్ వుల్-హక్ స్పష్టం చేశాడు. పాకిస్తాన్ క్రికెట్ వైఫల్యంపై సుదీర్ఘ విశ్లేషణ అనంతరమే జట్టు నుంచి ఫలితాలను ఆశించాలన్నాడు.'పాక్ క్రికెట్ అభిమానులకు ఇదే నా విన్నపం. జట్టు ప్రదర్శనపై ఓపిక పట్టండి. పాకిస్తాన్ క్రికెట్ను పటిష్టంగా తయారు చేయడానికి నా వంతు కృషి చేస్తా. ఇప్పటికిప్పుడే ఫలితాలను కోరవద్దు. రాత్రికి రాత్రే పాక్ జట్టును పటిష్టంగా మార్చే మ్యాజిక్ ఏమీ నా వద్దు లేదు. ప్రస్తుత నా ముందున్న లక్ష్యం ఇంగ్లండ్ టూర్కు సమతుల్యంగా ఉన్న జట్టును ఎంపిక చేయడమే' అని ఇంజమామ్ పేర్కొన్నాడు.

 

చీఫ్ సెలక్టర్ గా బాధ్యతలు తీసుకోవడం పట్ల హర్షం వ్యక్తం చేసిన ఇంజమామ్..ఆటగాళ్ల సెలక్షన్లోపూర్తి స్వేచ్ఛను కల్పిస్తూ పీసీబీ నుంచి తనకు స్పష్టమైన హామీ లభించిందని ఈ సందర్భంగా పేర్కొన్నాడు.  పాకిస్తాన్ ప్రధాన సెలక్టర్గా ఇంజమామ్ను పీసీబీ నియమించిన సంగతి తెలిసిందే. కొత్త ఎంపిక చేసిన సెలక్షన్ కమిటీలో మాజీ టెస్టు స్పిన్నర్ తౌసీఫ్ అహ్మద్, మాజీ టెస్టు ఓపెనర్ వాజహ్తుల్లా వాస్తి, మాజీ ఆల్ రౌండర్ వసీం హైదర్ సభ్యులుగా నియమిస్తూ పీసీబీ నిర్ణయం తీసుకుంది.

మరిన్ని వార్తలు