ఆసీస్ మాజీ కోచ్ మికీ ఆర్థర్ కు డబుల్ షాక్!

26 Jun, 2013 20:08 IST|Sakshi
ఆసీస్ మాజీ కోచ్ మికీ ఆర్థర్ కు డబుల్ షాక్!
ఆస్ట్రేలియా క్రికెట్ జట్టు కోచ్ పదవి నుంచి ఉద్వాసనకు గురైన మికీ ఆర్థర్ కు వ్యక్తిగతంగా మరో ఎదురెబ్బ తగిలింది. దీర్ఘకాలంగా క్యాన్సర్ తో పోరాడుతున్న ఆర్ధర్ తల్లి లిన్నే దక్షిణాఫ్రికాలోని కింబర్లీలో కన్నుమూశారు.  అయితే దక్షిణాఫ్రికాకు తిరుగుముఖ పట్టిన ఆర్ధర్ కు దుబాయ్ లో ఈ దుర్వార్త తెలిసింది. తల్లి మరణం తనకు, తన కుటుంబానికి  తీరని లోటు అని మీడియాతో ఆర్థర్ అన్నారు. ఆర్థర్ ను సోమవారం రోజున కోచ్ పదవి నుంచి తొలగించిన సంగతి తెలిసిందే. ఆషెష్ సిరీస్ కు 16 రోజుల ముందు  మికీ ఆర్థర్ ను కోచ్ పదవి నుంచి తొలగించి ప్రతి ఒక్కరిని ఆశ్చర్యానికి గురి చేసింది. 
 
ఛాంపియన్స్ ట్రోఫిలో ఆస్ట్రేలియా దారుణమైన ఓటమికి బాధ్యత తనదేనని మీడియా కాన్ఫరెన్స్ లో తన ఉద్వేగాని అణుచుకుంటూ ఆయన తెలిపారు. జట్టులో కొన్ని సమస్యలున్నప్పటికి.. ఆస్ట్రేలియా జట్టు సరైన దిశలో ప్రయాణిస్తోంది అని... త్వరలోనే అన్ని సర్దుకుంటాయని ఆర్ధర్ తెలిపాడు. క్రికెట్ ఆస్ట్రేలియా చీఫ్ జేమ్స్ సుథర్ ల్యాండ్, కెప్టెన్ మైఖెల్ క్లార్క్, కొత్త కోచ్ డారెన్ లెహ మన్, ఇతర జట్టు సభ్యులు ఆర్ధర్ ను పరామర్శించి.. సంతాపం తెలిపారు. 
 
మరిన్ని వార్తలు