వన్డే క్రికెట్ కష్టాల్లో ఉంది: ద్రవిడ్

13 Sep, 2014 01:02 IST|Sakshi
వన్డే క్రికెట్ కష్టాల్లో ఉంది: ద్రవిడ్

ముంబై: పరిమిత ఓవర్ల ఫార్మాట్ ఉనికిపై భారత మాజీ కెప్టెన్ రాహుల్ ద్రవిడ్ ఆందోళన వ్యక్తం చేశాడు. ప్రస్తుతం వన్డే క్రికెట్ కష్టాల్లో ఉందన్నాడు. ఆరవ దిలీప్ సర్దేశాయ్ స్మారక లెక్చర్‌లో ప్రసంగించిన ద్రవిడ్ ఈ ఫార్మాట్ మరింత ఆకర్షణీయంగా ఉండాలంటే ఏం చేయాలో సూచనలిచ్చాడు. ‘నా ఉద్దేశం ప్రకారం వన్డే క్రికెట్ అనేది తీవ్ర కష్టాల్లో ఉంది. చాంపియన్స్ ట్రోఫీ లేదా ప్రపంచకప్‌ల దృష్టి కోణం నుంచి చూస్తే ఇది అర్థమవుతుంది. అందుకే ద్వైపాక్షిక సిరీస్‌లు ఆడడం తగ్గించి వన్డే టోర్నమెంట్స్‌ను ఎక్కువగా ఆడించాలి. ఇక చకింగ్ అనేది నా దృష్టిలో నేరం కాదు. అది ఓ సాంకేతిక తప్పిదం మాత్రమే. అలాంటప్పుడు ఆ లోపాన్ని సరిచేసుకుని తిరిగి ఆడాలి. జట్టు విదేశీ పర్యటనల్లో భార్యలు, ప్రియురాళ్లను అనుమతించడంలో తప్పు లేదు’ అని ద్రవిడ్ స్పష్టం చేశాడు.
 వైకల్య విజేతలపై పుస్తకాన్ని ఆవిష్కరించిన ద్రవిడ్
 శారీరక, మానసిక వైకల్యాన్ని జయించి క్రీడల్లో విజేతలుగా నిలిచిన వారి గురించి రాసిన పుస్తకాన్ని రాహుల్ ద్రవిడ్ ఆవిష్కరించాడు. అంతర్జాతీయ మాజీ షట్లర్ సంజయ్ శర్మ, తన కూతురు మేదిని ఈ పుస్తకాన్ని రచించారు.
 

మరిన్ని వార్తలు