హారికకు మూడో స్థానం

7 Sep, 2014 00:33 IST|Sakshi
హారికకు మూడో స్థానం

షార్జా: ‘ఫిడే’ మహిళల గ్రాండ్‌ప్రి చెస్ టోర్నమెంట్‌లో ఆంధ్రప్రదేశ్ గ్రాండ్‌మాస్టర్ ద్రోణవల్లి హారిక మూడో స్థానాన్ని సంపాదించింది. శనివారం ముగిసిన ఈ 11 రౌండ్ల టోర్నమెంట్‌లో హారిక మొత్తం ఆరున్నర పాయింట్లు సాధించింది. చివరి రౌండ్‌లో హారిక 83 ఎత్తుల్లో బచిమెగ్ తువ్‌షిన్‌తగ్స్ (మంగోలియా)పై గెలిచింది. హారికతోపాటు బచిమెగ్, అనా ఉషెనినా (ఉక్రెయిన్), జుయ్ జావో (చైనా) ఆరున్నర పాయింట్లతో సంయుక్తంగా మూడో స్థానంలో నిలిచారు.
 
 అయితే టైబ్రేక్ స్కోరు ఆధారంగా ర్యాంక్‌ను వర్గీకరించగా... హారికకు మూడో స్థానం, జుయ్ జావోకు నాలుగో స్థానం, ఉషెనినాకు ఐదో స్థానం, బచిమెగ్‌కు ఆరో స్థానం దక్కాయి. ఆంధ్రప్రదేశ్‌కే చెందిన మరో గ్రాండ్‌మాస్టర్ కోనేరు హంపి ఐదున్నర పాయింట్లతో ఏడో స్థానంలో నిలిచింది. చివరి రౌండ్‌లో హంపి 38 ఎత్తుల్లో ఎలీనా డానిలియన్ (ఆర్మేనియా)పై గెలిచింది. 8.5 పాయింట్లతో జూ వెన్‌జున్, హూ ఇఫాన్ (చైనా) సమవుజ్జీలుగా నిలువగా మెరుగైన టైబ్రేక్ స్కోరు ఆధారంగా జూ వెన్‌జున్‌కు టైటిల్ లభించింది. హూ ఇఫాన్ రన్నరప్‌గా నిలిచింది.
 

Read latest Sports News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా