హారికకు ఐదో స్థానం

17 Feb, 2019 01:07 IST|Sakshi

సెయింట్‌ లూయిస్‌ (అమెరికా): కెయిన్స్‌ కప్‌ అంతర్జాతీయ చెస్‌ టోర్నమెంట్‌లో ఆంధ్రప్రదేశ్‌ గ్రాండ్‌మాస్టర్‌ ద్రోణవల్లి హారిక ఐదో స్థానంలో నిలిచింది. శనివారం ముగిసిన ఈ టోర్నమెంట్‌లో చివరిదైన తొమ్మిదో రౌండ్‌లో హారిక నల్ల పావులతో ఆడుతూ 60 ఎత్తుల్లో ఇరీనా క్రుష్‌ (అమెరికా) చేతిలో ఓడిపోయింది. పది మంది మేటి క్రీడాకారిణులు పాల్గొన్న ఈ టోర్నీలో హారిక 4.5 పాయింట్లు సంపాదించింది. ఏడు గేమ్‌లను ‘డ్రా’ చేసుకున్న ఆమె మరో గేమ్‌లో గెలిచి, ఒక గేమ్‌లో ఓడిపోయింది.

ఏడు పాయింట్లు సాధించిన వాలెంటినా గునీనా (రష్యా) విజేతగా అవతరించింది. 6.5 పాయింట్లతో ప్రపంచ మాజీ చాంపియన్‌ అలెగ్జాండ్రా కొస్టెనిక్‌ (రష్యా) రెండో స్థానంలో, 5.5 పాయింట్లతో ఇరీనా క్రుష్‌ మూడో స్థానంలో నిలిచారు. విజేత గునీనాకు 40 వేల డాలర్లు (రూ. 28 లక్షల 54 వేలు)... రన్నరప్‌ కొస్టెనిక్‌కు 30 వేల డాలర్లు (రూ. 21 లక్షల 40 వేలు)... మూడో స్థానం పొందిన ఇరీనా క్రుష్‌కు 20 వేల డాలర్లు (రూ. 14 లక్షల 27 వేలు), ఐదో స్థానంలో నిలిచిన హారికకు 9,500 డాలర్లు (రూ. 6 లక్షల 77 వేలు) ప్రైజ్‌మనీగా లభించాయి. 

>
మరిన్ని వార్తలు