టైబ్రేక్‌లపై హారిక, పద్మిని ఆశలు

19 Feb, 2017 01:28 IST|Sakshi
టైబ్రేక్‌లపై హారిక, పద్మిని ఆశలు

టెహరాన్  (ఇరాన్ ): ప్రపంచ మహిళల చెస్‌ చాంపియన్ షిప్‌లో భారత క్రీడాకారిణులు ద్రోణవల్లి హరిక, పద్మిని రౌత్‌ ముందంజ వేసే అవకాశాలు మళ్లీ టైబ్రేక్‌ గేమ్‌లపై ఆధారపడింది. శనివారం జరిగిన ప్రిక్వార్టర్‌ ఫైనల్లో రెండో గేమ్‌లలో వీరిద్దరూ తమ ప్రత్యరు్థలతో ‘డ్రా’ చేసుకున్నారు.

సోపికో గురామిష్‌విలి (జార్జియా)తో జరిగిన గేమ్‌ను హారిక 36 ఎతు్తల్లో... తాన్  జోంగి (చైనా)తో జరిగిన గేమ్‌ను పద్మిని 23 ఎతు్తల్లో ‘డ్రా’గా ముగించారు. ఫలితంగా వీరిద్దరి మధ్య నిర్ణీత రెండు గేమ్‌ల తర్వాత స్కోరు 1–1తో సమవైుంది. ఆదివారం జరిగే టైబ్రేక్‌ గేముల్లో గెలిచిన వారు క్వార్టర్‌ ఫైనల్‌కు అర్హత సాధిస్తారు.

మరిన్ని వార్తలు