నాలోని డ్రగ్స్ బలహీనతే ప్రత్యర్థికి వరంలా మారేది!

19 Sep, 2014 16:52 IST|Sakshi
నాలోని డ్రగ్స్ బలహీనతే ప్రత్యర్థికి వరంలా మారేది!

బ్యూనోస్ ఎయిర్స్: తనలోని పూర్తి స్థాయి ఆటగాడు బయట ప్రపంచానికి తెలియకపోవడానికి కారణాన్నిఅర్జెంటీనా మాజీ దిగ్గజం డిగో మారడోనా  తాజాగా వెల్లడించాడు.  ఇందుకు తనతో పాటు పాతుకుపోయి ఉన్న డ్రగ్స్ అలవాటే  ప్రధాన కారణంగా పేర్కొన్నాడు.  ఒక అర్జెంటీనా టెలివిజన్ కు ఇచ్చిన ఇంటర్యూలో మారడోనా పలు విషయాలను స్పష్టం చేశాడు.  'నేను డ్రగ్స్ కు బానిస అవ్వడం నా ఆటపై తీవ్ర ప్రభావం చూపింది. ఆ అలవాటే  నాలోని నైపుణ్యాన్ని బయటకు రాకుండా చేసింది. నేను ఇప్పటికీ సాధారణ జీవితంలోకి రాకపోవడానికి కారణం యువకుడిగా ఉన్నప్పటి నాలోని ఛాయలు ఇంకా వదిలి వెళ్లకపోవడమే' అని మారడోనా ఆవేదన వ్యక్తం చేశాడు.

 

చాలా సందర్భంల్లో తాను డ్రగ్స్ తీసుకోవటం ప్రత్యర్థులకు వరంలా మారేదని గతాన్ని గుర్తు చేసుకున్నాడు. 1986 వరల్డ్ కప్ సాధించిన అర్జెంటీనా టీంలో సభ్యుడైన మారోడానా.. అనంతరం ఆ జట్టుకు కోచ్ గా కూడా వ్యవహరించాడు. అయితే తాను కోచ్ గా 2010లో వీడ్కోలు చెప్పడాన్నిఇప్పటికీ తాను జీర్ణించుకోలేక పోతున్నానని స్పష్టం చేశాడు.  ఒకవేళ అవకాశం వస్తే తిరిగి ఆ బాధ్యతలు చేపట్టేందుకు సిద్ధంగా ఉన్నట్లు ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పాడు.

మరిన్ని వార్తలు