సమ న్యాయం ఏది?: డుప్లెసిస్‌ ధ్వజం

13 Mar, 2018 15:54 IST|Sakshi

పోర్ట్‌ ఎలిజబెత్‌:  క్రికెటర్ల ప‍్రవర్తనకు సంబంధించి అంతర్జాతీయ క్రికెట్‌ మండలి(ఐసీసీ) విధించే డీమెరిట్‌ పాయింట్లపై దక్షిణాఫ్రికా కెప్టెన్‌ డుప్లెసిస్‌ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశాడు. అం‍దరినీ సమాన దృష్టితో చూడాల్సిన ఐసీసీ పక్షపాత ధోరణితో వ్యవహరిస్తుందని మండిపడ్డాడు. ఇందుకు ఆసీస్‌ ఆటగాడు డేవిడ్‌ వార్నర్‌, తమ దేశ పేసర్‌ రబడాలపై చర్యలే ఉదాహరణగా డుప్లెసిస్‌ విమర్శించాడు. వీరి విషయంలో సమ న్యాయం జరగలేదని ధ్వజమెత్తాడు.

వార్నర్‌ తొలి టెస్ట్‌లో డికాక్‌ను ఉద్దేశపూర్వకంగా దూషించినపుడు లెవల్‌ 2 కింద మూడు డీమెరిట్‌ పాయింట్లు ఇచ్చారు. రెండో టెస్ట్‌లో రబడా అనుకోకుండా స్మిత్‌ భుజాన్ని తాకటంతో లెవల్‌2 కింద నాలుగు డీమెరిట్‌ పాయింట్లు, 65 శాతం మ్యాచ్‌ ఫీజులో కోత విధించారు. రబడాకి కూడా మూడు డీమెరిట్‌ పాయింట్లు ఇచ్చుంటే ఆస్ట్రేలియాతో జరిగే మిగతా టెస్టులు ఆడేవాడని కానీ ఐసీసీ తమకు వ్యతిరేకంగా ప్రవర్తించిందని ఐసీసీని  డుప్లెసిస్‌ విమర్శించాడు. ప్రస్తుతం రబడా అత్యుత్తమ ఫామ్‌లో ఉన్నాడు, రెండో టెస్ట్‌లో 11 వికెట్లతో విజయంలో కీలకపాత్ర పోషించిన విషయం తెలిసిందే. ఇక రబడా విషయంపై ఐసీసీ వ్యతిరేకంగా అప్పీల్‌కు వెళ్లినా లాభం ఉండదనే ఉద్దేశంతో వెళ్లటంలేదని డుప్లెసిస్‌ పేర్కొన్నాడు.

మరిన్ని వార్తలు