100 మీ.లో ద్యుతీ చంద్‌ కొత్త జాతీయ రికార్డు

12 Oct, 2019 05:37 IST|Sakshi

రాంచీ: భారత మహిళా స్టార్‌ స్ప్రింటర్‌ ద్యుతీ చంద్‌ 100 మీటర్ల విభాగంలో కొత్త జాతీయ రికార్డు నెలకొల్పింది. జాతీయ ఓపెన్‌ అథ్లెటిక్స్‌ఛాంపియన్ షిప్ లో ఈ ఒడిశా అథ్లెట్‌ 100 మీటర్ల విభాగంలో విజేతగా నిలిచి స్వర్ణ పతకాన్ని సొంతం చేసుకుంది. తెలంగాణకు చెందిన కోచ్‌ నాగపురి రమేశ్‌ వద్ద శిక్షణ తీసుకుంటున్న ద్యుతీ చంద్‌ ఫైనల్‌ రేసును 11.25 సెకన్లలో ముగించి అగ్రస్థానాన్ని దక్కించుకుంది. అంతకుముందు జరిగిన సెమీఫైనల్‌ రేసులో ద్యుతీ చంద్‌ 11.22 సెకన్లలో గమ్యానికి చేరింది. ఈ క్రమంలో 11.26 సెకన్లతో సంయుక్తంగా తన పేరిట (ఏప్రిల్, 2019లో), రచితా మిస్త్రీ (జూలై, 2000లో) పేరిట ఉన్న జాతీయ రికార్డును బద్దలు కొట్టింది.   

మరిన్ని వార్తలు