బెన్‌ స్టోక్స్‌పై ఈసీబీ ‘సస్పెన్షన్‌’

29 Sep, 2017 03:15 IST|Sakshi

లండన్‌: తప్పతాగి పబ్‌లో గొడవకు దిగిన ఆల్‌రౌండర్‌ బెన్‌ స్టోక్స్‌పై ఇంగ్లండ్‌ క్రికెట్‌ బోర్డు (ఈసీబీ) కఠినంగా వ్యవహరించేందుకు సిద్ధమైంది. ఈ కేసుకు సంబంధించి తమ సొంత విచారణతో పాటు పోలీస్‌ విచారణ కూడా పూర్తయ్యే వరకు అతడిని ఇంగ్లండ్‌ ఆడే అంతర్జాతీయ మ్యాచ్‌లకు ఎంపిక చేయబోమని ప్రకటించింది. స్టోక్స్‌తో పాటు ఘటన జరిగిన సమయంలో అక్కడే ఉన్న సహచర ఆటగాడు అలెక్స్‌ హేల్స్‌కు కూడా ఈ ‘సస్పెన్షన్‌’ వర్తిస్తుందని ఈసీబీ ప్రకటించింది.

నిజానికి బుధవారం ప్రతిష్టాత్మక యాషెస్‌ సిరీస్‌ కోసం ప్రకటించిన ఇంగ్లండ్‌ జట్టులో స్టోక్స్‌ వైస్‌ కెప్టెన్‌గా తన స్థానాన్ని నిలబెట్టుకున్నాడు. అయితే సోమవారం తెల్లవారుజామున బ్రిస్టల్‌లో జరిగిన ఈ ఘటనకు సంబంధించి వీడియోలు గురువారం బయటకు రావడంతో వివాదం ముదిరింది. ఒక వ్యక్తిపై స్టోక్స్‌ తీవ్రంగా దాడి చేస్తున్న దృశ్యాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఈ సాక్ష్యం కారణంగా పోలీస్‌ విచారణలో కూడా స్టోక్స్‌ దోషిగా తేలే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఈసీబీ తమ వైపు నుంచి చర్యలకు సిద్ధమైంది.

మరిన్ని వార్తలు