వచ్చే ఏడాది ఎనిమిది జట్లు!

21 Jan, 2017 10:36 IST|Sakshi
వచ్చే ఏడాది ఎనిమిది జట్లు!

సాక్షి, హైదరాబాద్: క్రీడాభిమానులను ఈ సీజన్‌లో విశేషంగా ఆకట్టుకున్న ప్రీమియర్ బ్యాడ్మింటన్ లీగ్ (పీబీఎల్)ను మరింత విస్తరించాలని భారత బ్యాడ్మింటన్ సంఘం (బాయ్), పీబీఎల్ నిర్వాహకులు స్పోర్‌‌ట్సలైవ్ భావిస్తున్నారు. ఇందులో భాగంగా వచ్చే ఏడాది జట్ల సంఖ్యను ఆరునుంచి ఎనిమిదికి పెంచనున్నారు.

 

రెండు నగరాల కోసం ప్రస్తుతం కోల్‌కతా, జైపూర్, అహ్మదాబాద్‌ల మధ్య పోటీ నెలకొంది. టోర్నమెంట్‌ను ఈ సంవత్సరం పక్షం రోజులపాటు నిర్వహించగా, దానికి అదనంగా మరో పది రోజులు పెంచాలనే ప్రతిపాదన కూడా పరిశీలనలో ఉంది. అదే జరిగితే డిసెంబర్ 20 నుంచి పీబీఎల్ ప్రారంభమయ్యే అవకాశం ఉంది. ఇటీవలే జనవరి 1నుంచి 15 వరకు జరిగిన పీబీఎల్ 2కు అద్భుత ఆదరణ లభించిందని స్పోర్‌‌ట్స లైవ్ డెరైక్టర్ ప్రసాద్ మంగిపూడి ప్రకటించారు.  

ఇదే కారణంగా దేశవ్యాప్తంగా వివిధ నగరాలనుంచి పలువురు ప్రముఖులు లీగ్‌లో భాగం అయ్యేందుకు సిద్ధంగా ఉన్నారని ఆయన చెప్పారు. తమ టోర్నీ విజయవంతం కావడం పట్ల ఆయన సంతోషం వ్యక్తం చేశారు.  ఐదు వేదికల్లోనూ స్టేడియంలకు పెద్ద సంఖ్యలో ఫ్యాన్‌‌స తరలి రాగా, టెలివిజన్‌లో ఈ టోర్నీని 3.2 కోట్ల మంది వీక్షించినట్లు ప్రసాద్ వెల్లడించారు. మరో వైపు ఈ ఏడాది పీబీఎల్ అనేక మంది ప్రతిభావంతులను వెలుగులోకి తెచ్చిందని భారత బ్యాడ్మింటన్ చీఫ్ కోచ్ పుల్లెల గోపీచంద్ వ్యాఖ్యానించారు.

 

ముఖ్యంగా సాత్విక్ సారుురాజ్, చిరాగ్ శెట్టిలాంటి కుర్రాళ్ల ఆట ప్రపంచానికి తెలిసిందని ఆయన అభిప్రాయపడ్డారు. రియో ఒలింపిక్స్ స్వర్ణ పతక విజేత కరోలినా మారిన్ రావడం వల్ల ఈ టోర్నీకి కళ పెరిగిందనే విషయాన్ని ఆయన అంగీకరించారు. కొంత మంది చైనా షట్లర్లు కూడా ఆసక్తి చూపించినా వేర్వేరు కారణాలతో వారు పాల్గొనలేదని, వచ్చే ఏడాది కచ్చితంగా పీబీఎల్‌లో భాగం అవుతారని ఆశాభావం వ్యక్తం చేశారు. అంతా ఊహించినట్లే సింధు, సైనా మధ్య మ్యాచ్ ఆసక్తికరంగా సాగిందని, టోర్నీలో ఎక్కువ మంది ఇదే మ్యాచ్‌ను చూసేందుకు ఆసక్తిని కనబర్చారని గోపీ విశ్లేషించారు.

 

మరిన్ని వార్తలు