సెమీస్‌లో ఏకలవ్య, గ్రీన్‌ ఓక్స్‌ జట్లు

8 Sep, 2017 10:54 IST|Sakshi
సెమీస్‌లో ఏకలవ్య, గ్రీన్‌ ఓక్స్‌ జట్లు

సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్‌ హ్యాండ్‌బాల్‌ స్కూల్‌ లీగ్‌లో ఏకలవ్య, గ్రీన్‌ ఓక్స్‌ స్కూల్‌ జట్లు సెమీస్‌కు చేరుకున్నాయి. సనత్‌నగర్‌ జీహెచ్‌ఎంసీ మినీ స్టేడియంలో గురువారం జరిగిన బాలికల క్వార్టర్స్‌ మ్యాచ్‌లో ఏకలవ్య స్కూల్‌ 5–3తో గతి స్కూల్‌పై, గతి ప్రభుత్వ పాఠశాల 7–3తో జేహెచ్‌పీఎస్, జూబ్లీహిల్స్‌పై, జీహెచ్‌ఎస్‌ పికెట్‌ స్కూల్‌ 9–4తో భారతీయ విద్యాభవన్‌పై, సీఎంఆర్‌ ఇంటర్నేషనల్‌ స్కూల్‌ 7–3తో మమత హైస్కూల్‌పై గెలుపొందాయి. బాలుర క్వార్టర్స్‌ మ్యాచ్‌ల్లో గ్రీన్‌ ఓక్స్‌ స్కూల్‌ 5–4తో సీహెచ్‌ఆర్‌హెచ్‌ఎస్‌పై, బ్లూ డైమండ్‌ స్కూల్‌ 6–3తో లిటిల్‌ స్కాలర్స్‌పై నెగ్గి సెమీస్‌కు చేరుకున్నాయి. ఈ పోటీలను రాష్ట్ర మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ ముఖ్య అతిథిగా విచ్చేసి ప్రారంభించారు. ఈ టోర్నీలో వివిధ ప్రాంతాలకు చెందిన 25 బాలుర, 16 బాలికల జట్లు పాల్గొన్నాయి.  

క్రీడాభివృద్ధికి కేంద్రం సహకరించాలి: తలసాని  

కేంద్రం ప్రత్యేక నిధులను కేటాయించి రాష్ట్రంలో క్రీడాభివృద్ధికి సహకరించాలని రాష్ట్ర మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా తలసాని మాట్లాడుతూ క్రీడలు అందరి జీవితాల్లో భాగం కావాలని ఆకాంక్షించారు. ఆటల్లో గెలుపోటములు సహజమని, క్రీడాకారులు స్ఫూర్తితో ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. రాష్ట్ర ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు క్రీడలకు ఎనలేని ప్రాధాన్యం ఇస్తున్నారని కొనియాడారు. జాతీయ, అంతర్జాతీయ స్థాయిల్లో రాణించే క్రీడాకారులకు తగిన ప్రోత్సాహకాలు అందిస్తూ వారు మరింత ఉన్నతంగా రాణించేందుకు కృషిచేస్తున్నారన్నారు.

విద్యార్థులు ప్రభుత్వం కల్పిస్తున్న అవకాశాలను సద్వినియోగం చేసుకొని చదువుతో పాటు క్రీడల్లోనూ రాణించాలని కోరారు. ఈ కార్యక్రమంలో సనత్‌నగర్‌ కార్పొరేటర్‌ కొలను లక్ష్మీ బాల్‌రెడ్డి, భారత హ్యాండ్‌బాల్‌ సమాఖ్య (హెచ్‌ఎఫ్‌ఐ) కార్యదర్శి ఆనందేశ్వర్‌ పాండే, రాష్ట్ర హ్యాండ్‌బాల్‌ సంఘం కార్యదర్శి పవన్‌కుమార్, అంతర్జాతీయ హ్యాండ్‌బాల్‌ క్రీడాకారుడు ఎంఏ అజీజ్‌ తదితరులు పాల్గొన్నారు.

 

Read latest Sports News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

ఫుట్‌బాల్‌కు ఆదరణ పెరుగుతోంది

బాస్కెట్‌బాల్‌ చాంప్‌ ఇన్‌కమ్‌ ట్యాక్స్‌

వెస్టిండీస్‌కు భారీ షాక్!

వేన్‌ రూనీపై రెండేళ్ల డ్రైవింగ్‌ నిషేధం

శ్రీశాంత్‌ నిషేధంపై హైకోర్టులో బీసీసీఐ పిటిషన్‌

కోహ్లీకి మరో పెళ్లి ప్రపోజల్‌

ఔను.. అతన్ని కావాలనే టార్గెట్‌ చేశాం: పాండ్యా

హామిల్టన్‌ హ్యాట్రిక్‌

శ్రీలంక క్రికెటర్పై రెండేళ్ల నిషేధం

లెగ్‌ స్పిన్నర్లే కీలకం

‘బుచ్చిబాబు’ విజేత హైదరాబాద్‌

లిఫ్టర్‌ దీక్షితకు రూ. 15 లక్షల నజరానా

ఆయుష్, సుభాష్‌లకు స్వర్ణాలు

ఇంద్రజిత్‌ అజేయ సెంచరీ

అమెరికా క్రికెట్‌ జట్టు కెప్టెన్‌గా హైదరాబాదీ

రైనాకు తప్పిన ప్రమాదం

హైదరాబాద్‌ జట్లకు టైటిల్స్‌

హైదరాబాద్‌ 329 ఆలౌట్‌

కబడ్డీ ఆటగాళ్ల గొడవ: తుపాకీతో కాల్పులు

టీ 20 మ్యాచ్: ఓ స్వీట్ రివేంజ్!

విరాట్‌ కోహ్లీ ఎవరు ?

ఇంకొక్కటే..

ఆటగాళ్లకు విశ్రాంతి కావాలి

ట్వీట్‌ వైరల్‌: కోహ్లీకి పాక్‌ అభిమానుల ప్రశంసలు

టాస్ 'అయోమయం'పై క్లారిటీ!

ఆర్చరీ ఉపాధ్యక్షులు శివకుమార్‌ కన్నుమూత

యూఎస్‌ ఓపెన్‌ 2017: ఫైనల్‌కు నాదల్‌

హరికృష్ణ నిష్క్రమణ

ఆరేళ్ల పాప లేఖపై సచిన్ స్పందన

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

‘మా కొడుకు మమ్మల్ని కలిపి ఉంచుతున్నాడు’

అడవి శేష్‌ ‘ఎవరు’ రీమేకా?

రూల్స్‌ బ్రేక్‌ చేసిన రాంగోపాల్‌ వర్మ!

ఉత్తర ట్రైలర్‌ లాంచ్‌

బైక్‌ మీద సినిమాకెళ్తున్నా : ఆర్జీవీ

సెన్సార్‌ పూర్తి చేసుకున్న ‘డియర్‌ కామ్రేడ్‌’