ఎల్గర్‌ సెంచరీ: దక్షిణాఫ్రికా 298/1

29 Sep, 2017 00:29 IST|Sakshi

పోష్‌స్ట్రూమ్‌: సొంతగడ్డపై బంగ్లాదేశ్‌తో ప్రారంభమైన తొలి టెస్టులో దక్షిణాఫ్రికా అదరగొట్టింది. ప్రత్యర్థి బలహీన బౌలింగ్‌ను సొమ్ము చేసుకుంటూ మొదటి రోజు భారీ స్కోరు సాధించింది. టాస్‌ ఓడి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన సఫారీ జట్టు ఆట ముగిసే సమయానికి 90 ఓవర్లలో వికెట్‌ నష్టానికి 298 పరుగులు చేసింది. డీన్‌ ఎల్గర్‌ (285 బంతుల్లో 128 బ్యాటింగ్‌; 9 ఫోర్లు, 2 సిక్సర్లు) సెంచరీతో చెలరేగగా... తొలి టెస్టు ఆడుతున్న ఎయిడెన్‌ మర్‌క్రమ్‌ (152 బంతుల్లో 97; 13 ఫోర్లు) దురదృష్టవశాత్తూ రనౌట్‌ అయి ఆ అవకాశం కోల్పోయాడు.

వీరిద్దరు తొలి వికెట్‌కు 196 పరుగులు జోడించారు. అనంతరం హషీం ఆమ్లా (103 బంతుల్లో 68 బ్యాటింగ్‌; 7 ఫోర్లు, 1 సిక్స్‌) ఎల్గర్‌కు అండగా నిలిచాడు. ఎల్గర్, ఆమ్లా జోడి రెండో వికెట్‌కు ఇప్పటికే 102 పరుగులు జత చేసింది.   

మరిన్ని వార్తలు