బర్మింగ్‌హామ్‌లో కలుద్దాం! 

16 Apr, 2018 01:13 IST|Sakshi

ముగిసిన 2018 కామన్వెల్త్‌ గేమ్స్‌

గోల్డ్‌కోస్ట్‌: లక్షల మంది ప్రేక్షకుల్ని మురిపించిన వేడుక, వేలమంది అథ్లెట్లను మెరిపించిన ఆటల పండుగ ముగిసింది. 12 రోజుల పాటు గోల్డ్‌ కోస్ట్‌ ఆతిథ్యమిచ్చిన కామన్వెల్త్‌గేమ్స్‌ ఆద్యంతం అలరించాయి. ఆసీస్‌ వాసులు ఆరంభం నుంచి గేమ్స్‌కు బ్రహ్మరథం పట్టారు. విజేతలకు జేజేలు పలికి క్రీడాస్ఫూర్తిని చాటారు.  గేమ్స్‌కు ముందు అట్టహాసంగా ప్రారంభమైన వేడుకల్లో ఆసీస్‌ చరిత్రను, సంప్రదాయాన్ని ఆవిష్కరిస్తే... ముగింపు వేడుకల్లో ఘనమైన పార్టీతో వీడ్కోలు పలికారు.

బాణాసంచా వెలుగులు, మిరుమిట్లు గొలిపే కాంతులు స్టేడియాన్ని వర్ణరంజితం చేశాయి. ఈ సందర్భంగా కామన్వెల్త్‌ గేమ్స్‌ పతాకాన్ని 2022 గేమ్స్‌కు ఆతిథ్యమివ్వనున్న బర్మింగ్‌హామ్‌ (ఇంగ్లండ్‌) అధికారులకు అందజేశారు.   ముగింపు వేడుకల్లో వివిధ దేశాలకు చెందిన అథ్లెట్లు తమ తమ జాతీయ జెండాలతో, పతకాలు గెలిచిన విజయగర్వంతో మార్చ్‌పాస్ట్‌లో పాల్గొన్నారు. భారత బృందానికి బాక్సర్‌ మేరీకోమ్‌ నేతృత్వం వహించింది.  

మరిన్ని వార్తలు