ఇంగ్లండ్ 182/3

24 Oct, 2015 00:48 IST|Sakshi

పాకిస్తాన్‌తో రెండో టెస్టు
దుబాయ్: పాకిస్తాన్‌తో జరుగుతున్న రెండో టెస్టు మ్యాచ్‌లో ఇంగ్లండ్ కోలుకుంది. మ్యాచ్ రెండో రోజు శుక్రవారం ఆట ముగిసే సమయానికి ఆ జట్టు తమ తొలి ఇన్నింగ్స్‌లో 3 వికెట్ల నష్టానికి 182 పరుగులు చేసింది. 14 పరుగులకే 2 వికెట్లు కోల్పోయిన దశలో రూట్ (118 బంతుల్లో 76 బ్యాటింగ్; 9 ఫోర్లు), కుక్ (117 బంతుల్లో 65; 10 ఫోర్లు) మూడో వికెట్‌కు 113 పరుగులు జోడించి జట్టును ఆదుకున్నారు. ప్రస్తుతం ఇంగ్లండ్ మరో 196 పరుగులు వెనుకబడి ఉంది.
 
అంతకు ముందు పాక్ తమ తొలి ఇన్నింగ్స్‌లో 378 పరుగులకు ఆలౌటైంది. కెప్టెన్ మిస్బావుల్ హక్ (197 బంతుల్లో 102; 8 ఫోర్లు, 5 సిక్సర్లు) సెంచరీతో చెలరేగాడు. 41 ఏళ్ల వయసు దాటాక ఒక బ్యాట్స్‌మన్ శతకం సాధించడం 1981 తర్వాత ఇదే మొదటి సారి కావడం విశేషం. ఇతర బ్యాట్స్‌మెన్ అసద్ షఫీఖ్ (178 బంతుల్లో 83; 9 ఫోర్లు), యూనిస్ ఖాన్ (56), మసూద్ (54) కూడా రాణించారు. ఇంగ్లండ్ బౌలర్లలో వుడ్, అలీలకు చెరో 3 వికెట్లు దక్కాయి.

మరిన్ని వార్తలు