ఇంగ్లండ్‌‘ఎ’ 310/2 

17 Jul, 2018 01:04 IST|Sakshi

వర్సెస్టర్‌: ఓపెనర్‌ అలిస్టర్‌ కుక్‌ (154 నాటౌట్‌) అజేయ శతకంతో భారత ‘ఎ’ జట్టుతో అనధికారిక టెస్టులో ఇంగ్లండ్‌ ‘ఎ’ భారీ స్కోరు దిశగా వెళ్తోంది. అతడికి గబ్బిన్స్‌ (73), మలాన్‌ (59 నాటౌట్‌) అండగా నిలవడంతో సోమవారం తొలి రోజు ఆట ముగిసేసరికి 310/2తో నిలిచింది. ఈ నాలుగు రోజుల మ్యాచ్‌లో ఇంగ్లండ్‌ ‘ఎ’ టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకుంది. రానున్న టెస్టు సిరీస్‌ను దృష్టిలో పెట్టుకుని ప్రాక్టీస్‌ కోసం కుక్‌తో పాటు వోక్స్, బెస్‌..., భారత్‌ ఆటగాళ్లు మురళీ విజయ్, అజింక్య రహానే ఈ మ్యాచ్‌ ఆడుతున్నారు. 

మరిన్ని వార్తలు