ఇంగ్లండ్, ఆసీస్ 'యాషెస్' సమరం షురూ

10 Jul, 2013 16:23 IST|Sakshi
టాస్ వేస్తున్న ఇంగ్లండ్ కెప్టెన్ కుక్

ఇంగ్లండ్, ఆస్ట్రేలియా మధ్య యాషెస్ సమరం ప్రారంభమయింది. ట్రెంట్‌బ్రిడ్జ్ మైదానంలో తొలి టెస్ట్ మ్యాచ్ బుధవారం ఆరంభమయింది. టాస్ గెలిచిన ఇంగ్లీషు జట్టు బ్యాటింగ్ ఎంచుకుంది. ఇంగ్లండ్ కెప్టెన్ కుక్, రూట్ ఓపెనర్లుగా బ్యాటింగ్ కు వచ్చారు.

వరుసగా రెండుసార్లు యాషెస్ గెలిచి హ్యాట్రిక్‌పై కన్నేసిన ఇంగ్లండ్... ఈసారి స్వదేశంలోనూ సత్తా చూపాలని కసిగా ఉంది. మరోవైపు వరుస ఓటములతో సతమతమవుతున్న ఆసీస్.. యాషెస్ విజయం ద్వారా స్వదేశంలో అభిమానుల మనసులు గెలవాలని ఆశిస్తోంది.

వరుసగా రెండు యాషెస్ విజయాలు... మధ్యలో నంబర్‌వన్ ర్యాంక్ సాధించడం... స్వదేశంలో బలమైన రికార్డు... ఇవన్నీ ఇంగ్లండ్‌ను ఉత్తేజపరుస్తు న్నాయి. ఇటీవల కాలంలో అన్ని క్రీడల్లోనూ ఇంగ్లండ్ విశేషమైన ఫలితాలు సాధిస్తోంది. ముర్రే వింబుల్డన్ గెలవగానే... ఇక యావత్ దేశం యాషెస్ వైపు ఆసక్తిగా చూస్తోంది.

కెప్టెన్ కుక్ నిలకడ ఈ జట్టుకు ప్రధాన బలం. పీటర్సన్ గాయం నుంచి కోలుకుని మళ్లీ అడుగుపెట్టడం ఇంగ్లండ్‌కు కొత్త ఉత్సాహాన్నిచ్చింది. ఓవరాల్‌గా ఇటీవల ఫామ్‌ను గమనిస్తే... ఈసారి ఇంగ్లండ్‌నే ఫేవరెట్‌గా కనబడుతోంది.

మరిన్ని వార్తలు