ఆధిక్యంలో పాకిస్తాన్

17 Jul, 2016 03:59 IST|Sakshi

రెండో ఇన్నింగ్స్‌లో  214/8
లండన్: ఇంగ్లండ్‌తో జరుగుతున్న తొలి టెస్టు మ్యాచ్‌లో పాకిస్తాన్ 281 పరుగుల ఆధిక్యంతో పటిష్ట స్థితిలో నిలిచింది. శనివారం మూడో రోజు ఆట ముగిసే సమయానికి పాకిస్తాన్ రెండో ఇన్నింగ్స్‌లో 77 ఓవర్లలో ఎనిమిది వికెట్లకు 214 పరుగులు చేసింది. వోక్స్ (5/31) విజృంభణతో 60 పరుగులకే నాలుగు వికెట్లు పడినా షఫీఖ్ (49), సర్ఫరాజ్ (45) ఆదుకున్నారు. క్రీజులో యాసిర్ షా (30 బ్యాటింగ్), ఆమిర్ పరుగులేమీ చేయకుండా ఉన్నారు.

అంతకుముందు ఇంగ్లండ్ తమ తొలి ఇన్నింగ్స్‌లో 79.1 ఓవర్లలో 272 పరుగులకే ఆలౌట్ కావడంతో పాక్‌కు 67 పరుగుల తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం లభించింది. లెగ్ స్పిన్నర్ యాసిర్ షా (6/72)  ఇంగ్లండ్ వెన్ను విరిచాడు. గత 49 ఏళ్లలో లార్డ్స్ మైదానంలో తొలి ఇన్నింగ్స్‌లో ఐదు అంతకంటే ఎక్కువ వికెట్లు తీసిన తొలి లెగ్‌స్పిన్నర్‌గా యాసిర్ షా నిలిచాడు. ఆమిర్, రాహత్, రియాజ్‌లకు ఒక్కో వికెట్ దక్కింది.

మరిన్ని వార్తలు