అంత సులభంగా ఎలా మాట్లాడతారో!

18 Mar, 2020 10:43 IST|Sakshi

జాతి వివక్షను తేలిగ్గా తీసుకోకూడదు

ఇంగ్లండ్‌ పేసర్‌ జోఫ్రా ఆర్చర్‌ వ్యాఖ్య

లండన్‌: ‘జాతి వివక్ష’ అంశాన్ని తేలిగ్గా పరిగణించరాదని, వ్యాఖ్యలు చేసే వారిపై తగిన చర్యలు తీసుకోవాలని ఇంగ్లండ్‌ యువ పేస్‌ బౌలర్‌ జోఫ్రా ఆర్చర్‌ అన్నాడు. గతంలో తనకు ఎదురైన అనుభవాల గురించి మంగళవారం ఇన్‌స్టాగ్రామ్‌ వేదికగా స్పందించాడు. ‘ఒక వ్యక్తిని ఉద్దేశించి అంత సులభంగా జాతి వివక్ష వ్యాఖ్యలు ఎలా చేస్తారో అర్థం కాదు. ఇలా చేయడం వల్ల వారేం పొందుతారో! మరెవరికీ తరచుగా ఈ అనుభవం ఎదురై ఉండదేమో. ఇలాంటి చర్యలపై కూడా నేను చాలా ఆలోచించాకే స్పందిస్తుంటా. ఇది ఎంతమాత్రం ఆమోదించదగినది కాదు. దీనిఐ సరైన రీతిలో చర్యలు తీసుకోవాల్సిందే’ అని 24 ఏళ్ల ఆర్చర్‌ పేర్కొన్నాడు. గతేడాది న్యూజిలాండ్‌తో జరిగిన రెండో టెస్టులో ఓటమి అనంతరం స్టేడియంలో ప్రేక్షకుడు ఒకరు ఆర్చర్‌పై అదే పనిగా జాతి వివక్ష వ్యాఖ్యలకు తెగబడ్డాడు. దీంతో అతనిపై రెండేళ్లపాటు న్యూజిలాండ్‌లో జాతీయ, అంతర్జాతీయ మ్యాచ్‌లు చూడకుండా నిషేదం విధించారు.
(చదవండి: మ్యాక్స్‌వెల్‌ ‘భారతీయ నిశ్చితార్థం’)
(‘కోహ్లికి అలా సూచించడంలో అర్థం లేదు’)

మరిన్ని వార్తలు