ఇప్పుడు కోహ్లితో డేంజర్‌: ఇంగ్లండ్‌ కోచ్‌

17 Aug, 2018 14:15 IST|Sakshi
విరాట్‌ కోహ్లి

నాటింగ్‌హామ్‌: ప్రస్తుత పరిస్థితుల్లో టీమిండియా కెప్టెన్‌ విరాట్‌ కోహ్లితో మరింత ప్రమాదకరమని ఇంగ్లండ్‌ కోచ్‌ ట్రెవర్‌ బెలీస్‌ అభిప్రాయపడ్డాడు. నేలకు కొట్టిన బంతిలా కోహ్లి విజృంభించే అవకాశం ఉందని, అతనొక్కడే మ్యాచ్‌ తిప్పేయగలడని తమ ఆటగాళ్లను హెచ్చరించాడు. భారత్‌-ఇంగ్లండ్‌ల మధ్య మూడో టెస్టు శనివారం నుంచి ప్రారంభకానున్న విషయం తెలిసిందే.

ఈ నేపథ్యంలో బెలీస్‌ మీడియాతో మాట్లాడుతూ.. ‘గాయం నుంచి కోలుకున్న కోహ్లితో మరింత ప్రమాదకరం. గతాన్ని పరిశీలిస్తే ఎంతో మంది ఆటగాళ్లు గాయాల నుంచి కోలుకోని పరుగులు సాధించారు. వికెట్లు దక్కించుకున్నారు. కోహ్లి కూడా అలానే రాణించే అవకాశం ఉంది. అతను ప్రాక్టీస్‌లో ఎలాంటి సమస్య లేకుండా స్లిప్‌లో క్యాచ్‌లు అందుకున్నాడు. దీన్ని బట్టి చూస్తే అతను తప్పకుండా మూడో టెస్టుకు అందుబాటులోఉంటాడు. అతను ఆడిన ఆడకపోయినా మా వ్యూహం మాత్రం మారదు. ట్రెంట్‌ బ్రిడ్జ్‌ మైదానం పిచ్‌సైతం స్వింగ్‌కు అనుకూలిస్తుంది. లార్డ్స్‌లో భారత్‌ను దెబ్బకొట్టినట్లే ఇక్కడా అదే పునరావృతం చేస్తాం.’ అని చెప్పుకొచ్చాడు.

 ఇక తొలి టెస్టులో కోహ్లి సింగిల్‌ హ్యాండ్‌ ప్రదర్శనతో రాణించగా తృటిలో విజయం చేజారిన విషయం తెలిసిందే. రెండో టెస్టులో గాయంతో ఇబ్బంది పడటంతో భారత్‌ కనీస పోరాట పటిమను ప్రదర్శించ లేకపోయింది. దీంతో కోహ్లి మూడో టెస్టు ఆడటంపై పలు అనుమానాలు నెలకొన్నాయి. కానీ కోహ్లి ప్రాక్టీస్‌ సెషన్‌లో ముమ్మరంగా సాధన చేయడం చూస్తే అతను గాయం నుంచి కోలుకున్నట్లు తెలుస్తోంది. ఇది భారత్‌కు అనుకూల అంశం కాగా.. ట్రెంట్‌ బ్రిడ్జ్‌లో ఇంగ్లండ్‌ పేసర్‌ జేమ్స్‌ అండర్సన్‌కు మంచి రికార్డు ఉండటం ప్రతికూల అంశం.

మరిన్ని వార్తలు