3 పరుగులు.. 3 వికెట్లు ఢమాల్!

12 Jan, 2017 14:45 IST|Sakshi
3 పరుగులు.. 3 వికెట్లు ఢమాల్!

ముంబై: భారత్‌-ఏ జట్టుతో జరుగుతున్న రెండో వార్మప్ మ్యాచ్‌లో ఇంగ్లండ్ మూడు పరుగుల వ్యవధిలో మూడు వికెట్లను కోల్పోయింది. రహానే కెప్టెన్సీలో యువ బౌలర్లు మెరుగైన ప్రదర్శన చేస్తున్నారు. టీమ్ స్కోరు 163 వద్ద నాలుగో వికెట్ కోల్పోయిన ఇంగ్లండ్.. 164 వద్ద ఐదో వికెట్, 165వద్ద ఆరో వికెట్ ను కోల్పోయింది. ఇన్నింగ్స్ 27వ ఓవర్ వేసిన దిండా చివరి బంతికి బెయిర్ స్టో(64: 65 బంతుల్లో 10 ఫోర్లు) కీపర్ పంత్‌కు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. ఆ మరుసటి ఓవర్లో బట్లర్  పరుగులేవీ చేయకుండానే రసూల్ బౌలింగ్ లో అతడే క్యాచ్ పట్టడంతో డకౌట్ గా వెనుదిరిగాడు. మరోసారి దిండా మ్యాజిక్ చేశాడు. 29వ ఓవర్ తొలి బంతికి మోయిన్ అలీ(1)ని ఔట్ చేశాడు.  

ఇక్కడి బ్రాబౌర్న్ స్డేడియంలో తొలుత టాస్ గెలిచిన ఇంగ్లండ్ బ్యాటింగ్ ఎంచుకుంది. తొలి ఐదు ఓవర్లలో 42 పరుగుల వద్ద ఓపెనర్ జాసన్ రాయ్ హిట్ వికెట్ రూపంలో ఔటయ్యాడు. హేల్స్ హాఫ్ సెంచరీ(51: 53 బంతుల్లో 8 ఫోర్లు)తో ఆకట్టుకున్నాడు. అయితే జట్టు స్కోరు 116 వద్ద హెల్స్, ఇంగ్లండ్ కెప్టెన్ మోర్గాన్ ఔట్ కావడంతో బెయిర్ స్టో, స్టోక్స్ మరో వికెడ్ పడకుండా జాగ్రత్తపడ్డారు. దిండాను బెయిర్ స్టో ఔట్ చేయగానే మరో రెండు వికెట్లను ఇంగ్లండ్ కోల్పోయింది. 30 ఓవర్లు ముగిసేసరికి ఇంగ్లండ్ 6 వికెట్లు కోల్పోయి 165 పరుగులు చేసింది. 

మరిన్ని వార్తలు