ఇంగ్లండ్‌పై బంగ్లా ‘హ్యాట్రిక్‌’ సాధించేనా?

8 Jun, 2019 14:42 IST|Sakshi

కార్డిఫ్‌: వన్డే వరల్డ్‌కప్‌లో హాట్‌ పేవరెట్‌గా బరిలోకి దిగిన ఇంగ్లండ్‌.. బంగ్లాదేశ్‌తో పోరుకు సన్నద్ధమైంది.  గత రెండు ప్రపంచకప్‌లో బంగ్లాదేశ్‌ చేతిలో ఓటమి పాలైన ఇంగ్లండ్‌ దానికి చెక్‌ పెట్టాలని భావిస్తోంది. మరొకవైపు ఇంగ్లండ్‌పై హ్యాట్రిక్‌ వరల్డ్‌కప్‌ విజయం సాధించాలనే పట్టుదలతో బంగ్లా బరిలోకి దిగింది.  గడిచిన నాలుగేళ్లలో ఈ రెండు జట్లు చాలా పటిష్టంగా కనిపిస్తున్నాయి. దాంతో ఆసక్తికర సమరం జరిగే అవకాశం ఉంది.

ఇంగ్లండ్‌ భీకరంగా పురోగతి సాధించగా... బంగ్లా అన్ని పెద్ద జట్లకూ దీటుగా నిలుస్తోంది.  ముఖాముఖి పోరులో ఇరు జట్ల మధ్య ఇప్పటివరకు 20 వన్డేలు జరగ్గా 16 మ్యాచ్‌ల్లో ఇంగ్లండ్‌ గెలిచింది. నాలుగింటిలో బంగ్లాదేశ్‌ విజయం సాధించింది. ప్రపంచ కప్‌లో మాత్రం బంగ్లాదే పైచేయి కావడం విశేషం. ఇక వరల్డ్‌కప్‌లో మూడు మ్యాచ్‌లాడగా... రెండింటి (2011, 15)లో బంగ్లాదేశ్, ఒకదాంట్లో (2007) ఇంగ్లండ్‌ నెగ్గాయి. ఈ వికెట్‌ కొంత నెమ్మదిగానూ ఉంటుంది. మరొకవైపు బౌండరీ పరిధి చిన్నది కావడంతో భారీ స్కోర్లు నమోదయ్యే అవకాశం ఉంది. ఈ మ్యాచ్‌లో టాస్‌ గెలిచిన బంగ్లాదేశ్‌ తొలుత ఫీల్డింగ్‌ ఎంచుకుంది. టాస్‌ గెలిచిన బంగ్లా కెప్టెన్‌ మొర్తజా ముందుగా ఇంగ్లండ్‌ను బ్యాటింగ్‌కు ఆహ్వానించాడు.

తుది జట్లు

ఇంగ్లండ్‌
ఇయాన్‌ మోర్గాన్‌(కెప్టెన్‌), జేసన్‌ రాయ్‌, జోనీ బెయిర్‌స్టో, జోరూట్‌, బెన్‌ స్టోక్స్‌, జోస్‌ బట్లర్‌, క్రిస్‌ వోక్స్‌, జోఫ్రా ఆర్చర్‌, ఆదిల్‌ రషిద్‌, లియామ్‌ ప్లంకెట్‌, మార్క్‌ వుడ్‌

బంగ్లాదేశ్‌
మొర్తజా(కెప్టెన్‌), తమీమ్‌ ఇక్బాల్‌, సౌమ్య సర్కార్‌, షకీబుల్‌ హసన్‌, ముష్ఫికర్‌ రహీమ్‌, మహ్మద్‌ మిధున్‌, మొహ్మదుల్లా, మొసదెక్‌ హాసన్‌, మహ్మద్‌ సైఫుద్దీన్‌, మెహిదీ హసన్‌, ముస్తాఫిజర్‌ రహ్మాన్‌

మరిన్ని వార్తలు