ఇంగ్లండ్‌దే వన్డే సిరీస్‌ 

21 Oct, 2018 01:07 IST|Sakshi

కొలంబో: మరో మ్యాచ్‌ మిగిలి ఉండగానే శ్రీలంకతో ఐదు వన్డేల సిరీస్‌ను ఇంగ్లండ్‌ 3–0తో సొంతం చేసుకుంది. శనివారం వరుణుడు ఆటంకం కలిగించిన నాలుగో వన్డేలో డక్‌వర్త్‌ లూయిస్‌ ప్రకారం ఇంగ్లండ్‌ 18 పరుగులతో నెగ్గింది. మొదట లంక 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 273 పరుగులు చేసింది.

షనక (66; 4 ఫోర్లు, 5 సిక్స్‌లు) బౌండరీలతో రెచ్చిపోగా... డిక్‌వెలా (52; 5 ఫోర్లు) ఆకట్టుకున్నారు. అనంతరం జాసన్‌ రాయ్‌ (45; 5 ఫోర్లు, 1 సిక్స్‌), జో రూట్‌ (32 నాటౌట్‌), కెప్టెన్‌ మోర్గాన్‌ (31 నాటౌట్‌; 3 ఫోర్లు, 1 సిక్స్‌) రాణించడంతో  ఇంగ్లండ్‌ 27 ఓవర్లలో 2 వికెట్లకు 132 పరుగులు చేసింది. ఆ సమయంలో వర్షం పడటంతోపాటు ఆట సాధ్యపడలేదు.    

మరిన్ని వార్తలు