ఐదో టెస్టులో ఇంగ్లండ్ కు భారీ ఆధిక్యం

17 Aug, 2014 17:30 IST|Sakshi
ఐదో టెస్టులో ఇంగ్లండ్ కు భారీ ఆధిక్యం

ఓవల్: భారత్ తో ఇక్కడ జరుగుతున్న ఐదో టెస్టులో ఇంగ్లండ్ తన తొలి ఇన్నింగ్స్ లో  భారీ ఆధిక్యం సాధించింది. ఓవర్ నైట్ స్కోరు ఏడు వికెట్లకు 385 పరుగులతో ఆదివారం ఇన్నింగ్స్ ఆరంభించిన ఇంగ్లండ్ మరో వంద పరుగులకు పైగా జోడించి తొలి ఇన్నింగ్స్ ను 486 పరుగుల వద్ద ముగించింది. దీంతో ఇంగ్లండ్ కు 338 పరుగుల భారీ ఆధిక్యం దక్కింది. ఇంగ్లండ్ చివరి వరుస ఆటగాళ్లు జోర్డాన్ (20), బ్రాడ్(37) పరుగులు జోడించి జట్టు భారీ పరుగులు చేయడంలో తోడ్పడ్డారు. భారత్ బౌలర్లలో ఇషాంత్ శర్మకు నాలుగు వికెట్లు దక్కగా, అశ్విన్ కు మూడు వికెట్లు, ఆరూన్ రెండు, భువనేశ్వర్ కుమార్ కు ఒక వికెట్టు లభించింది. ఇంగ్లండ్ ఆటగాళ్లలో రూట్(149)పరుగులు చేసి మరో మారు ఆకట్టుకున్నాడు.

 

అంతకుముందు భారత్ తన తొలి ఇన్నింగ్స్ లో 148 పరుగులకే చాపచుట్టేసిన సంగతి తెలిసిందే. మూడో రోజు ఆటలో రెండో ఇన్నింగ్స్ ను ఆరంభించనున్న భారత్.. ఓటమి నుంచి తప్పించుకోవాలంటే మరో రెండు రోజల పాటు ఆటను కొనసాగించాల్సి ఉంది.

మరిన్ని వార్తలు