ఇంగ్లండ్ ఘన విజయం

1 Aug, 2015 00:43 IST|Sakshi
ఇంగ్లండ్ ఘన విజయం

మూడో టెస్టులో 8 వికెట్లతో ఆసీస్ చిత్తు
బర్మింగ్‌హామ్:
యాషెస్ సిరీస్‌లో మ్యాచ్‌లు విభిన్నంగా జరుగుతున్నాయి. తొలి టెస్టులో ఇంగ్లండ్ ఘన విజయం సాధించగా... రెండో టెస్టులో ఆస్ట్రేలియా భారీ విజయం సాధించింది. మళ్లీ మూడో టెస్టులో ఇంగ్లండ్ ఆల్‌రౌండ్ ప్రదర్శనతో అదరగొట్టి 8 వికెట్లతో ఆస్ట్రేలియాను చిత్తు చేసింది. మూడో రోజు శుక్రవారం 121 పరుగుల విజయలక్ష్యంతో రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన ఇంగ్లండ్ 32.1 ఓవర్లలో రెండు వికెట్లకు 124 పరుగులు చేసి నెగ్గింది. బెల్ (65 నాటౌట్), రూట్ (38 నాటౌట్) రాణించారు. అంతకుముందు ఆస్ట్రేలియా రెండో ఇన్నింగ్స్‌లో 79.1 ఓవర్లలో 265 పరుగులకు ఆలౌటయింది. నెవిల్ (59), స్టార్క్ (58) అర్ధసెంచరీలు సాధించారు. ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ ఫిన్ ఆరు వికెట్లు తీశాడు. ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో ఇంగ్లండ్ ప్రస్తుతం 2-1తో ఆధిక్యంలో ఉంది. నాలుగో టెస్టు ఆగస్టు 6 నుంచి జరుగుతుంది.

మరిన్ని వార్తలు