ఇంగ్లండ్‌కే లారా ఓటు!

27 May, 2017 00:06 IST|Sakshi
ఇంగ్లండ్‌కే లారా ఓటు!

చాంపియన్స్‌ ట్రోఫీలో ఇంగ్లండ్‌ జట్టుకే టైటిల్‌ గెలిచే అవకాశాలు ఉన్నాయని మాజీ క్రికెటర్‌ బ్రియాన్‌ లారా అభిప్రాయపడ్డారు. ఆ జట్టు ఆటతీరు వన్డేలకు సరిగ్గా సరిపోతుందని ఆయన అన్నారు. 2004లో లారా నాయకత్వంలోనే వెస్టిండీస్‌ ఫైనల్లో ఇంగ్లండ్‌ను ఓడించి విజేతగా నిలిచింది. ‘ఇక్కడి పరిస్థితులను బట్టి చూస్తే నా దృష్టిలో ఇంగ్లండ్‌ జట్టే ఫేవరెట్‌.

టి20 ప్రపంచకప్‌లో విండీస్‌ చేతిలో ఓడిన జట్టుతో పోలిస్తే ఇప్పుడు ఆ జట్టు ఎంతో మారిపోయింది. గతంలోలాగా ఎవరో ఒక ఆటగాడిపై ఆధార పడకుండా ఇప్పుడు మొత్తం టీమ్‌ పటిష్టంగా కనిపిస్తోంది. జట్టులో ఎక్కువ సంఖ్యలో ఆల్‌రౌండర్లు ఉండటం ఇంగ్లండ్‌కు అదనపు బలం’ అని లారా వ్యాఖ్యానించారు. 

>
మరిన్ని వార్తలు