ఇంగ్లండ్ విజయలక్ష్యం 455

2 Jun, 2015 00:39 IST|Sakshi

లీడ్స్: న్యూజిలాండ్ నిర్దేశించిన 455 పరుగుల భారీ లక్ష్యంతో రెండో ఇన్నింగ్స్ ఆరంభించిన ఇంగ్లండ్‌కు వర్షం అడ్డుపడింది. దీంతో సోమవారం నాలుగో రోజు ఆటలో 13 ఓవర్లకు వికెట్ నష్టపోకుండా 44 పరుగులు చేసింది. క్రీజులో ఓపెనర్లు లిత్ (29 బంతుల్లో 24 బ్యాటింగ్; 4 ఫోర్లు), కుక్ (49 బంతుల్లో 18 బ్యాటింగ్; 1 ఫోర్) ఉన్నారు. నేడు (మంగళవారం) ఆటకు చివరి రోజు. అంతకుముందు 338/6 ఓవర్‌నైట్ స్కోరుతో ఆట ప్రారంభించిన కివీస్ తమ రెండో ఇన్నింగ్స్‌లో 91 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 454 పరుగుల వద్ద డిక్లేర్ చేసింది.

వాట్లింగ్ (163 బంతుల్లో 120; 15 ఫోర్లు, 1 సిక్స్), క్రెయిగ్ (77 బంతుల్లో 58 నాటౌట్; 9 ఫోర్లు, 1 సిక్స్), సౌతీ (24 బంతుల్లో 40; 6 ఫోర్లు, 1 సిక్స్) రాణించారు. వుడ్‌కు మూడు, అండర్సన్, బ్రాడ్‌లకు రెండేసి వికెట్లు దక్కాయి.

మరిన్ని వార్తలు